తమ్మినేని వీరభద్రం సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఒకప్పుడు సేవ.. పనులు చేస్తే ఓట్లు..సీట్లు వచ్చేవని..  ఓట్లు సీట్లు తెచ్చుకున్న trs..కాంగ్రెస్ పార్టీలు కరోనా టైం లో ఒక్క ఐసోలేశన్ కేంద్రం అయినా పెట్టరా..?  అని ప్రశ్నించారు తమ్మినేని వీరభద్రం.  మేము పేదల కోసం ఐశోలేశన్ కేంద్రాన్ని పెట్టాం..గర్వంగా చెప్తామని... మేము ఓట్లు..సీట్లు గెలుచుకోవడం లో వెనక పడ్డాం నిజమేనని పేర్కొన్నారు తమ్మినేని వీరభద్రం. ఓట్లు వచ్చినా..సీట్లు రాకపోయినా ప్రజల పక్షాన ఉంటుంది సీపీఎం అని పేర్కొన్నారు తమ్మినేని వీరభద్రం.   Trs..బీజేపీ మీద మిలిటెంట్ పోరాటాల నిర్మాణం కోసమే ఈ మహాసభ  అని.. తెలంగాణ లో బీజేపీ విష సర్పం లెక్క పెరుగుతుందని చెప్పారు తమ్మినేని వీరభద్రం. అధికారం ఇప్పట్లో రాకపోవచ్చు అని... కానీ బీజేపీ వైఖరి ఏంటన్నది అందరూ ఆలోచన చేయాలో విభజన హామీలు అమలు చేయని కేంద్రం మీద కెసిఆర్ ఎందుకు కొట్లాడటం లేదని ప్రశ్నించారు తమ్మినేని వీరభద్రం.  

మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల మాదిరిగా తెగబడి ఎందుకు కొట్ల దటం లేదని ఫైర్‌ అయ్యారు తమ్మినేని వీరభద్రం. ఈ మద్య బీజేపీ కి వ్యతిరేకంగా మాట్లాడే ఆలోచన ఎదో చేస్తున్నారని.. ప్రజలు నమ్మేలా కెసిఆర్ వ్యవహారం చేస్తే హర్షిస్తమన్నారు తమ్మినేని వీరభద్రం.  బీజేపీ కి వ్యతిరేకంగా కెసిఆర్ పని చేస్తే మద్దతు ఇస్తాం అంటే...ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటాం అని కాదని..  బీజేపీ అనే భూతాన్ని ఎదుర్కో వడం కోసం దయ్యలన్నిటిని కలుపుకుని పోతామని చెప్పారు తమ్మినేని వీరభద్రం. బీజేపీ అధికారం లో ఉంటే rss విధానాలే అమలు చేస్తుందని.. 2019 లో అధికారం లోకి రాగానే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందన్నారు. ప్రజా ఉద్యమాలు తోనే కేంద్రం దిగి వస్తోందని..  రైతాంగ పోరాటం మొదటి సారి మోడీని లొంగ దీసిందని పేర్కొన్నారు.   పొరుగు దేశాలతో సంబంధాలు కూడా దిగజారాయన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

cpi