గులాబీ క్యాంపులో ఓ అంతర్మధనం నడుస్తుందట. ఓ పార్టీకి అనవసరంగా ఇచ్చిన హైప్ తలకు చుట్టుకుందని ఫీల్ అవుతుందట. సమయం సందర్భం లేకుండా అందివచ్చిన అవకాశాన్ని క్యాష్ చేసుకునే వీలు తామే కల్పించామేమోనని భావిస్తుందట. చాణుక్య రాజకీయాలకు పెట్టింది పేరు గా ఉన్న గులాబీ శిబిరం ఇలాగే ఆలోచిస్తోందా..? ఏ పార్టీ గురించి అంతలా ఫీల్ అవుతోంది..? కరీంనగర్ లో బండి సంజయ్ అరెస్టు ఇష్యూ తెలంగాణ భవన్ లో ఇప్పటికీ చర్చకు దారితీస్తోందట. సంజయ్ దీక్షను భగ్నం చేసే పోయేదానికి అనవసరంగా అరెస్టు దాకా వెళ్లాల్సి వచ్చిందని గులాబీ నేతలు ఫీల్ అవుతున్నారట.బండి అరెస్టుతో బిజెపి జాతీయ స్థాయి నేతలు రంగంలోకి దిగడం, లేనిపోని రాద్ధాంతం చేయడం అన్నీ చేజేతులా చేసుకున్నామేమో అని అనుకుంటున్నారట.

పోలీసులు కూడా ఓవరాక్షన్ చేశారని, బండి సంజయ్ ప్రివిలేజ్ కమిటీ కి ఫిర్యాదు చేయడం, దానికి కమిటీ వివరణ కోరడం అంతా స్వయంకృతాపరాధంగా భావిస్తున్నారట. ఆ సమయంలో గులాబీ కార్యకర్తలు, కమలం పార్టీ కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా బిజెపి పర్యటనను టిఆర్ఎస్ ప్రతి ఘటించడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇన్నాళ్లు కేంద్రంతో సర్దుబాటు ధోరణితో వ్యవహరిస్తున్న టిఆర్ఎస్ అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైంది. ఇక కమలం పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని కారు పార్టీ వ్యూహం మార్చిందన్న చర్చ జరుగుతోంది. బిజెపి పార్టీకి అన్ని విషయాల్లో టీఆర్ఎస్ మద్దతు ఇస్తూ వచ్చింది. అలాగే బిజెపి కూడా టిఆర్ఎస్ కు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చింది. కానీ ఒకే ఒక్క ఎన్నిక ఇరు పార్టీల మధ్య నిప్పు రాజేసింది. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమిపాలైంది. అయినా టిఆర్ఎస్ లైట్ తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయినా కారు పార్టీ పట్టించుకోలేదు. కానీ హుజరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు మాత్రం గులాబీ బాస్ కేసీఆర్ కు మింగుడు పడడం లేదట. సర్వశక్తులు ఒడ్డిన ఓడిపోవడం సహించలేకపోతున్నారట. హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత వరుస ప్రెస్ మీట్ లతో బీజేపీపై కెసిఆర్ విరుచుకుపడ్డారు. దానికి తగ్గట్టుగానే కాషాయం పార్టీ నేతలు కూడా అంతే దూకుడు ప్రదర్శించారు.

కరీంనగర్ అరెస్ట్ ఎపిసోడ్ నుంచి మరింత రెచ్చిపోయింది. అలా అనవసరంగా వచ్చినావు హైప్ ఇప్పుడు గులాబీ పార్టీ మెడకు చుట్టుకుంటుందన్న భావనతో ఉన్న కేసీఆర్ ఇక ఆ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదనకుంటున్నారట. బండి సంజయ్ అరెస్ట్ ఎపిసోడ్ తర్వాత బిజెపికి వచ్చిన హైప్ అనూహ్యంగా తగ్గించే వ్యూహాలను రచిస్తున్న గులాబి నేతలు దాన్ని ఏమేరకు వర్కౌట్ చేస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: