కుదిరితే అప్పులు తేవటం, కాదంటే ఆస్తులు అమ్మటం. పూట గడవాలంటే ఇదే పరిపాటిగా మారింది రాష్ట్ర సర్కార్ పరిస్థితి. ఆర్థిక  నిర్మాణం కోసం అప్పులమీద అప్పులు చేస్తోంది. కొత్తగా చేస్తున్న అప్పుల్లో ఎక్కువ భాగం పాత అప్పులకు మిత్తిలు కట్టేందుకే వాడుతోంది. కేసీఆర్ ఖాన్ నిర్వాకంతో రాష్ట్రంలో తలసరి అప్పు 80 వేలకు చేరింది.

 అప్పులు చేసే విషయంలో ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు టిఆర్ఎస్ ప్రభుత్వం. 2021-22 ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల్లో 30 వేల 194 కోట్ల రూపాయలు అప్పు తెస్తే అందులో 11882 రెండు కోట్లు, గతంలో చేసిన అప్పులకు ఇంట్రెస్ట్ కట్టడానికే ఉపయోగించింది. విచ్చలవిడిగా అప్పులు చేయడంతో ఖజానాపై భారం పడుతోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఓ వైపు ప్రజలపై చార్జీలు మోపుతూ, లిక్కర్ వ్యాట్ పెంచుతూ, భూములమ్ముతూ ఆదాయం రాబట్టుకున్న సర్కార్, నెల మొదలైందంటే చాలు అప్పు చేస్తే కానీ జీతాలకు, పాత అప్పుల వడ్డీలకు సర్దుబాటు చేయలేని పరిస్థితికి చేరుకుంది. చాలా స్కీమ్ లకు నిధులు విడుదల కావడం లేదు, కొన్ని స్కీములు ఆర్భాటంగా ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా నిధులు లేక ఇప్పటివరకు ప్రారంభించలేదు.

 రాష్ట్ర ఆర్థిక శాఖ తాజాగా కాక్ కు పంపిన రిపోర్టు ప్రకారం 2021 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు సొంత రాబడి 8 నెలల్లో 64857 కోట్లు ప్రభుత్వానికి సమకూరింది. ఇంకో 30 వేల 194 కోట్లు అప్పు తీసుకుంది. సగటున నెలకు 4 వేల కోట్ల అప్పు తెచ్చినా, రాష్ట్ర ఆర్థిక నిర్వహణ కష్టంగా సాగుతోంది. ప్రతి నెలా యావరేజ్ గా ఇన్ కమ్ రాష్ట్రానికి వస్తున్న పదివేల కోట్ల రూపాయల లోపు ఉంటుంది. ప్రతి నెలా ఉద్యోగుల జీతాలు, పెన్షన్ లకు 3500 కోట్లతో పాటు పాత అప్పుల కిస్తీలు, వడ్డీలకు ఇంకో మూడు వేల కోట్లు వెచ్చించాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో భారీ అంచనాలతో తెస్తున్న స్కీమ్ లకు కావలసిన నిధులు ఎలా తెస్తారో.

ఇప్పటికి అమలవుతున్న స్కీమ్ లకు డబ్బులు ఎలా అడ్జస్ట్ చేస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. 2014లో 69,517 కోట్ల అప్పులుండగా, ఇప్పుడు ఏడేళ్లలో అది నాలుగు లక్షల కోట్లకు చేరింది. ఇందులో లక్షన్నర కోట్ల అప్పులు, ఎఫ్ఆర్బీఎం చట్టం పరిధిలో కాకుండా, వివిధ కార్పొరేషన్లు ఇతర మార్గాల ద్వారా తీసుకున్నవే ఉన్నాయి. రాష్ట్ర సర్కారు తీసుకొనే అప్పులతో ప్రజలపై తలసరి అప్పు ఏటేటా పెరిగిపోతోంది. రాష్ట్ర సర్కార్ దీంతో ప్రజలపై తలసరి అప్పు  81,944 కు చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: