పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే ఆశలు...అదేంటి అసలు పవన్‌కు వైసీపీకి పడదు...రెండు పార్టీలు శత్రువులుగా ఉన్నాయి. ఏదో పవన్‌పై టీడీపీ అసలు పెట్టుకుంది అంటే దానికో అర్ధం ఉంది..పరోక్షంగా టీడీపీ-జనసేనలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. మరి అలాంటప్పుడు పవన్‌పై వైసీపీ ఎమ్మెల్యే ఎందుకు ఆశ పెట్టుకుంటారనే డౌట్ రావొచ్చు...అయితే ఆ డౌట్‌కు ఫుల్ క్లారిటీ ఉంది.

ఆ క్లారిటీ తెలుసుకునే ముందు..ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యే ఎవరు? ఆయన కథ ఏంటి? అనేది చూస్తే...ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే  పొన్నాడ సతీశ్ కుమార్‌కు పరోక్షంగా పవన్ అవసరం పడింది. అది ఎలా ఉంటే...ఈయన ముమ్మిడివరం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అది కూడా పరోక్షంగా మెగా ఫ్యామిలీ వల్లే..2009లో కాంగ్రెస్ నుంచి సతీశ్ పోటీ చేశారు. అప్పుడు టీడీపీతో పాటు చిరంజీవి ప్రజారాజ్యం కూడా ముమ్మిడివరం బరిలో ఉంది.

అప్పుడు సతీశ్‌కు 51 వేల ఓట్లు, టీడీపీకి 49 వేల ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు 2 వేల మెజారిటీతో సతీశ్ గెలిచి బయటపడ్డారు. కానీ అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి 31 వేల ఓట్లు పడ్డాయి. అంటే ఓట్లు ఎంత బాగా చీల్చిందో అర్ధం చేసుకోవచ్చు. 2014లో ఈ ఓట్ల చీలిక ఉండకూడదని చెప్పి పవన్, టీడీపీకి సపోర్ట్ చేశారు. దీంతో ముమ్మిడివరంలో టీడీపీ గెలిచింది.

2019లో మళ్ళీ 2009 సీన్ రిపీట్ అయింది. ఈ సారి ప్రజారాజ్యం ప్లేస్‌లో జనసేన వచ్చింది. ఇక సతీశ్ వైసీపీ నుంచి పోటీ చేసి దాదాపు 78 వేల ఓట్లు తెచ్చుకున్నారు. అటు టీడీపీకి 73 వేల ఓట్ల వరకు పడ్డాయి. అంటే అంతటి జగన్ గాలిలో కూడా సతీశ్‌ 5 వేల ఓట్ల మెజారిటీతో బయటపడ్డారు. ఇక ఇక్కడ జనసేన 33 వేల ఓట్లు తెచ్చుకుంది. మరి ఓట్లు చీలిపోయాయో అర్ధమవుతుంది. అంటే రెండుసార్లు ఓట్లు చీలడంతో సతీశ్ గట్టెక్కారు. అందుకే ఈ సారి కూడా పవన్..టీడీపీతో పొత్తు పెట్టుకోకపోతే సతీశ్‌కు ప్లస్. పొత్తు పెట్టుకుంటే మాత్రం సతీశ్ అస్సామే. మరి పవన్...సతీశ్ ఆశలు నెరవేరుస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: