నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల అందరికీ సీట్లు దక్కుతాయా? అంటే అబ్బే చాలా కష్టమనే చెప్పాలి. రాజకీయంగా ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ..ప్రజా మద్ధతు పొందాలి. అలాంటప్పుడు పనిచేయని ఎమ్మెల్యేలని పక్కన పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే గెలిచే వ్యూహాలు వేసేటప్పుడు...ప్రజా మద్ధతు తగ్గిన ఎమ్మెల్యేలని మాత్రం సైడ్ చేయక తప్పదు. జగన్ ఎప్పుడు ఈ స్ట్రాటజీని ఫాలో అవుతారు..2014లో గెలిచిన ఎమ్మెల్యేల్లో కొందరికి 2019 ఎన్నికల్లో సీట్లు ఇవ్వలేదు.

ఇక సేమ్ ఫార్ములా 2024 ఎన్నికల్లో కూడా వర్తిస్తుంది.  అంటే 2019 ఎన్నికల్లో గెలిచిన కొందరు ఎమ్మెల్యేలకు నెక్స్ట్ ఎన్నికల్లో సీట్లు రావు...అది కూడా సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేలకు సీట్లు దక్కడం కష్టం...ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ లెక్కన చూసుకుంటే ప్రతి జిల్లాలోనూ కొందరు సీట్లు మారతాయని అర్ధమవుతుంది. మరి సీఎం జగన్ సొంత జిల్లా కడపలో కూడా సీట్లు మారతాయా? అంటే చెప్పడం కష్టమనే చెప్పాలి.

ఎందుకంటే కడప జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. పైగా ఈ జిల్లాలో టీడీపీకి పెద్ద బలం లేదు..అలాంటప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టడం చాలా కష్టం. కాబట్టి ఎక్కువ శాతం కడప ఎమ్మెల్యేలని మళ్ళీ కొనసాగించేలా ఉన్నారు. పులివెందులలో ఎలాగో జగన్ బరిలో దిగుతారు..ఆ సీటు పక్కన పెడితే..కమలాపురంలో జగన్ మేనమామ రవీంద్రా రెడ్డి మళ్ళీ పోటీ చేయడం ఫిక్స్.

రాజంపేటలో మేడా మల్లిఖార్జున్ రెడ్డి, ప్రొద్దుటూరులో శివప్రసాద్ రెడ్డి, జమ్మలమడుగులో సుధీర్ రెడ్డి, రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డి, రైల్వే కోడూరులో కోరుముట్ల శ్రీనివాసులు, బద్వేలులో డాక్టర్ సుధా, కడపలో అంజాద్ బాషాలు పోటీ చేయడం దాదాపు ఖాయమే. ఇక మైదుకూరులో కూడా శెట్టిపల్లి రఘురామిరెడ్డి మళ్ళీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే కడపలో 10 స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు దాదాపు పోటీ చేయడం ఫిక్స్. మరి చివరి నిమిషంలో ఏమన్నా  మార్పులు జరిగితే చెప్పలేం.  


మరింత సమాచారం తెలుసుకోండి: