ఏపీలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎప్పుడో హద్దులు దాటేసింది. ఒకపార్టీని భుజనేసుకోవటంలో భాగంగా ప్రత్యర్ధి పార్టీని నానా రకాలుగా గబ్బు పట్టించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబునాయుడుకు మద్దతుగా ఎల్లోమీడియాగా ముద్రపడిన మీడియా యాజమాన్యాలన్నీ చేస్తున్నదిదే. ఇప్పుడీ విషయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎలాగైనా జనాల్లో అన్ పాపులర్ చేయాలని తెగ ప్రయత్నిస్తోంది. మొదటిదేమో పీఆర్సీ వివాదంలో ఉద్యోగసంఘాలకు మద్దతుగా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయటం.




ఇక రెండో అంశం ఏమిటంటే జగన్-చిరంజీవి భేటీ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు పెట్టడమే టార్గెట్ గా కథనాలు ఇచ్చింది. చిరు భోజనానికేనా వచ్చింది ? అనే క్యాప్షన్తో పెద్ద కథనమే ఇచ్చింది.  భోజనం చేయటానికి మాత్రమే జగన్ తో భేటీ అయ్యారని చెప్పి చిరంజీవిని మంత్రి పేర్నినాని అవమానించారని తెగ బాధపడిపోయింది. జగన్-చిరంజీవి భేటీలో ఏమి జరిగిందనే విషయాన్ని ఎవరు అధికారికంగా చెప్పరు. మీడియానే తన మార్గాల్లో విషయం తెలుసుకుని కథనాలు ఇస్తుంది.




అయితే ఇపుడు జరుగుతున్నదేమంటే విషయం తెలుసుకుని కథనాలు ఇవ్వటం వదిలేసి ఏదేదో ఊహించేసుకుని జగన్ను టార్గెట్ చేసి కథనాలిచ్చింది. ఈ విషయం బాగా తెలుసు కాబట్టే మంత్రితో మీడియా ఇదే విషయాన్ని ప్రస్తావించినపుడు భోజనం చేసి వెళ్ళిపోయారంతే అని చాలా తేలిగ్గా చెప్పారు. దాన్ని చిరంజీవిని మంత్రి అవమానించారంటు పెద్ద కథనాన్నే అచ్చేసింది. అంటే జగన్-చిరంజీవి మధ్యలో గొడవలు పెట్టడమే ఎల్లోమీడియా ఉద్దేశ్యంగా కనబడుతోంది. జగన్ కు చిరంజీవి ఎక్కడ మద్దతు ప్రకటిస్తారో అనే భయం కూడా ఎల్లోమీడియాలో బాగా కనబడుతోంది.




ఇక పీఆర్సీ వివాదాన్ని తీసుకుంటే కొత్త పీఆర్సీతో జీతాలు, పాత పీఆర్సీతో జీతాల వివరాలను ప్రజలకు వివరించాలని ప్రభుత్వం అనుకున్నది. అందుకనే ఒక టేబుల్ రెడీచేసి వాలంటీర్ల ద్వారా జనాలకు ప్రభుత్వం వివరించే ప్రయత్నం చేస్తోంది. దీన్ని ఉద్యోగుల మీద విషం చిమ్మే వ్యూహమంటు పెద్దగా అచ్చేసింది. ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందంటు ఇన్ని రోజులు ఉద్యోగసంఘాల నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా.




ఎవరివాదనకు వాళ్ళు కట్టుబడున్నపుడు ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ఎవరి మార్గాలు వాళ్ళకుంటాయి. దీన్ని ప్రభుత్వం విషయం చిమ్ముతోందని అనటంలో అర్ధమేలేదు. మొత్తానికి ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత తీసుకురావటానికి ఎల్లోమీడియా నానా అవస్తలు పడుతోంది. మరి వీళ్ళ కృషి ఫలిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: