పంజాబ్ లో బీజేపీ అధికారంలోకి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. అయితే సాగు చట్టాల కారణంగా ఇప్పటికే అక్కడ జరగాల్సిన డ్యామేజీ అంతా జరిగిపోయింది. సాగు చట్టాలను వెనక్కి తీసుకున్న తర్వాత కూడా పంజాబ్ రైతు సంఘాలు బీజేపీకి మద్దతివ్వడానికి వెనకగుడు వేస్తున్నాయి. ఆమధ్య కేంద్ర మంత్రి తిరిగి రైతు చట్టాలను ప్రవేశ పెట్టే అవకాశముందని నోరు జారడంతో బీజేపీ దిద్దుకోలేని తప్పు చేసినట్టయింది. కానీ పంజాబ్ లో కాంగ్రెస్ అధికారాన్ని ఎలాగైనా కూలదోయాలనేది బీజేపీ మాస్టర్ ప్లాన్.

పంజాబ్ గేమ్ ప్లాన్ లో భాగంగా బీజేపీ.. ప్రస్తుత సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీపైకి ఈడీని ఉసికొల్పిందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల చరణ్ జీత్ సింగ్ చన్నీ, ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితుల కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరిగాయి. వీటిని రాజకీయ కక్షగా భావిస్తున్నా ఈ దాడుల వెనక అసలు కారణం మరొకటి ఉందని తెలుస్తోంది.

వాస్తవానికి పంజాబ్ లో కాంగ్రెస్ ని ఎవరూ దెబ్బ కొట్టక్కర్లేదు, అంతర్గత కుమ్ములాటలే కాంగ్రెస్ ని బలహీనం చేస్తున్నాయి. కానీ సిద్ధూ జనాకర్షణ కలిగిన నేతగా కాంగ్రెస్ కి ఆయువుపట్టుగా ఉన్నారు. ఈ దశలో సిద్ధూని దెబ్బకొట్టాలంటే, సిద్ధూ వైరి వర్గం చరణ్ జీత్ సింగ్ చన్నీని హైలెట్ చేయాలి. ఇటీవల జరిగిన ఈడీ దాడులతో చరణ్ జీత్ సింగ్ చన్నీ బాగా పాపులర్ అయ్యారు. ఆయనపై పంజాబ్ లో సింపతీ పెరిగింది. అది కాంగ్రెస్ కి అనుకూలమా లేక, చరణ్ జీత్ సింగ్ కి అనుకూలమా అనే విషయం పక్కనపెడితే.. సిద్ధూ గురించి మాట్లాడుకోవడం కంటే.. చరణ్ జీత్ గురించి మాట్లాడుకోవడమే ఎక్కువగా జరుగుతోంది.

సిద్ధూకి చెక్ పెట్టేందుకేనా..?
పంజాబ్ లో సిద్ధూ కారణంగా అధికారాన్ని కోల్పోయిన మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఇప్పుడు బీజేపీతో చేతులు కలిపారు. ఆయన కూడా సిద్ధూని అణగదొక్కాలని చూస్తున్నారు. దానికి బీజేపీ సాయం తీసుకున్నారు. చరణ్ జీత్ సింగ్ చన్నీ హైలెట్ అయితే ఆటోమేటిక్ గా కాంగ్రెస్ లో సిద్ధూ ప్రాభవం, ప్రభావం రెండూ తగ్గిపోతాయి. దానికి అనుగుణంగానే ఇప్పుడు పంజాబ్ లో బీజేపీ పావులు కదుపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: