ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో సెల్ఫీ అనేది ఒక భాగంగా మారిపోయింది. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా ఆ మధురమైన క్షణాన్ని కెమెరాలో బంధించడానికి సెల్ఫీ లు తెగ తీసుకుంటున్నారు ఎంతోమంది. ఇలా సెల్ఫీలు తీసుకునే సమయంలో చిత్రవిచిత్రమైన ఫోజులు కూడా ఇస్తూ తెగ ఆనందపడి పోతున్నారు. ఇలా ఇటీవలి కాలంలో అటు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా సెల్ఫీల మోజులో పడి మునిగితేలుతున్నారు. ఇక కొన్ని కొన్ని సార్లు సెల్ఫీల కోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్న  ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి మరి కొన్నిసార్లు ఇలాంటి సెల్ఫీలు ఎంతోమంది ఫేమస్ కావడానికి కూడా కారణం అవుతూ ఉంటాయి.


 ఇక్కడ సెల్ఫీ తీసుకోవడమే అతనికి అదృష్టం గా మారిపోయింది. అతను తీసుకున్న సెల్ఫీలు అంతర్జాతీయంగా అతన్ని ఒక సెలబ్రిటీ గా మార్చడమే కాదు కోట్ల రూపాయల ఆదాయాన్ని కూడా తెచ్చిపెట్టాయి. ఆగండాగండి మీరు చెప్పేది నిజమేనా సెల్ఫీలు ఏంటి కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టడం ఏంటి అదెలా కుదురుతుంది అని ఆశ్చర్య పోతున్నారు కదా. కానీ ఇతని విషయంలో ఇది నిజం అయింది. సుల్తాన్ గుస్తాఫ్ ఆల్ ఘోజళీ అనే 22 ఏళ్ల యువకుడు ఇండోనేషియాలో ఉంటున్నాడు. ఓ యూనివర్సిటీ లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు సదరు యువకుడు. అయితే కంప్యూటర్ ముందు కూర్చొని రోజూ ఒకటే సెల్ఫీ తీసుకుంటాడు ఇలా సెల్ఫీ తీసుకోవడం అలవాటు గా మార్చుకున్నాడు సదరు యువకుడు. ఇక ఐదేళ్ల నుంచి ఇలాగే చేస్తూ వస్తున్నాడు. గ్రాడ్యుయేషన్ సమయంలో తనలో వచ్చిన మార్పులు అన్నింటినీ తెలిపే విధంగా సెల్ఫీల అన్నింటితో కలిసి ఓ టైమ్ లాప్స్ వీడియోని చేద్దాం అని అనుకున్నాడు సదరు యువకుడు. ఇంతలోనే నాన్ ఫంజిబుల్ టోకెన్ లకు సంబంధించిన కొన్ని వార్తలు అతని కంట పడ్డాయి. వెంటనే సంబంధిత వెబ్ సైట్ లో ఖాతా తెరిచి ఘోజాలి ఎవిరిడే పేరుతో ఏకంగా 993 సెల్ఫీల ను అమ్మకానికి పెట్టేసాడు. ఇక ఒక్క సెల్ఫీ ధర మూడు డాలర్లు గా ఫిక్స్ చేశాడు. సెల్ఫీ లను కొనేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారట. రోజు తీసుకున్న సెల్ఫీ ల కారణంగా కోట్ల రూపాయలు సంపాదించాడు సదరు యువకుడు. ఇక ఇదంతా చదివిన తర్వాత ఈ ఐడియా ఏదో బాగుంది అని అనిపిస్తుంది కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: