ఉక్రెయిన్ విషయంలో అగ్ర రాజ్యాలుగా కొనసాగుతున్న అమెరికా, రష్యాల మధ్య వివాదం రోజురోజుకూ మరింత ముదురుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణంలో యుద్ధం తలెత్తుత్తుందో అనే విధంగానే మారిపోయింది పరిస్థితి. అగ్ర దేశంగా కొనసాగుతున్న అమెరికా తోపాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఉక్రెయిన్ కి మద్దతు గా ఉన్నాం అంటూ బహిరంగంగానే ప్రకటించారు. ఉక్రెయిన్ విషయంలో రష్యా వ్యవహరిస్తున్న తీరును మార్చుకోవాలి అంటూ ఇప్పటికే ఎన్నో రకాలు హెచ్చరికలు కూడా జారీ చేశారు.


 కానీ అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం తగ్గేది లేదు అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. దేనికైనా సిద్ధం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే లక్షకుపైగా సైనికులని ఉక్రెయిన్ సరిహద్దులో మోహరించారు అన్న విషయం తెలిసిందే. ఇక ఉక్రెయిన్ దేశానికి సంబంధించిన కొంత భూభాగాన్ని కూడా ఆక్రమించింది రష్యా. ఇక రానున్న రోజుల్లో ఉక్రెయిన్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని భావిస్తోంది. దీంతో ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కాదు.. రష్యా అమెరికా మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఉక్రెయిన్ తరఫున ఇప్పటికే అమెరికా ఎన్నోసార్లు రష్యాతో చర్చలు జరిపిన అవి విఫలం అవుతూనే ఉన్నాయి.



 దీంతో ఇక రష్యా అమెరికా మధ్య యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది అని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఎందుకంటే అమెరికా వెంట ఉన్న  యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా యుద్ధంలో పాల్గొనే అవకాశం ఉంది. అదే సమయంలో రష్యా మిత్రదేశాలు అయినా చైనా పాకిస్తాన్ టర్కీ లాంటి దేశాలు కూడా యుద్ధంలో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో ఇక అన్ని దేశాల మధ్య యుద్ధం చివరికి మూడో ప్రపంచ యుద్ధానికిదారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికేమాటల యుద్ధం నడుస్తోంది. ఇక ఎటువైపు నుంచి మొదట ఆయుధ దాడి జరుగుతుందో అన్నది  కూడా తెలియని విధంగా మారిపోయింది. ఇక ఎటు వైపు నుంచి దాడి జరిగినా అది పెద్ద యుద్ధానికి దారి తీయడం మాత్రం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: