కాళేశ్వరంపై మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన !
వ్యూహం ప్రకారం ప్రజల కనీస అవసరాలు తీర్చడానికే కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని.. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు దేశానికి స్ఫూర్తి దాయకమన్నారు రాష్ట్ర మంత్రి కేటీఆర్.  తెలంగాణ లో ఈ రోజు అమలు అవుతున్న పథకాలు దేశంలో రేపు అమలు అవుతున్నాయి...మంచినీటి సరఫరా, రైతు బంధు పథకాలు కేంద్రం అమలు చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 24 గంటల కరెంట్ సరఫరా అవుతుంది...కొండపోచంపల్లి నుంచి గండి పేటకు మంచినీటి సరఫరాకు సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు రాష్ట్ర మంత్రి కేటీఆర్.  తెలంగాణ ఏర్పాటు కాగానే 2 వేల కోట్ల తో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తీసుకున్నామని.. హైదరాబాద్ అంటే... ghmc ఒక్కటే కాదు... ORR లోపల ఉన్న 25 మున్సిపాలిటీలను హైదరాబాద్ గా గుర్తించాలని తెలిపారు రాష్ట్ర మంత్రి కేటీఆర్.


హైదరాబాద్ అన్ని నగరాల కంటే వేగంగా విస్తరిస్తోందన్నారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఢిల్లీ, చెన్నై, ముంబయి నగరాలు వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయని వెల్లడించారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. హైదరాబాద్ మహానగరంలో 2051 సంవత్సరం నాటికి అవసరమైన వసతుల కోసం ఆలోచన చేస్తున్నామని ప్రకటన చేశారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఆరు వేల కోట్లతో మంచినీటి ప్రాజెక్టులు చేపట్టామని.. చెన్నై లాంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు రాష్ట్ర మంత్రి కేటీఆర్.కాళేశ్వరం ఇరిగేషన్ కోసం మాత్రమే కాదన్నారు రాష్ట్ర మంత్రి కేటీఆర్... మల్లన్నసాగర్, కొండ పోచమ్మ రిజర్వాయర్ల ద్వారా నీటిని హైదరాబాద్ తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు రాష్ట్ర మంత్రి కేటీఆర్.ఓఅర్ఆర్ చుట్టూ ఉన్న గ్రామాలకు నీటి సౌకర్యం కల్పించడం కోసం మంత్రి కేటీఆర్ 12 వందల కోట్లు కేటాయించారని.. రాబోయే రోజుల్లో మినరల్ వాటర్ వద్దు...మిషన్ భగీరథ నీళ్లు కావాలని జనం అడుగుతారన్నారు ఎంపీ జితేందర్‌ రెడ్డి.  41 రిజర్వాయర్లు ...580 కోట్లతో మణికొండ,నార్సింగి, బండ్ల గూడ,శంషాబాద్ మున్సిపాలిటీ లతో పాటు నాలుగు నియోజకవర్గలలో ప్రతి ఇంటికి నీటి సౌకర్యం అన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

ktr