ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయం వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం రోజు రోజుకు తారాస్థాయికి చేరుకుంటుంది. స‌వాల్‌కు ప్ర‌తి స‌వాల్ ఇలా ఎవ‌రికీ వారు విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు చేసుకుంటూనే ఉన్నారు. కృష్ణాజిల్లా గుడివాడ‌లో క్యాసినో ఏర్పాటు చేసిన‌ట్టు ఆరోప‌ణ‌ల‌పై మంత్రి కొడాలి నాని స్పందించారు. క్యాసినో ప్ర‌చారం పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. త‌న క‌ల్యాణ మండ‌పంలో క్యాసినో నిర్వ‌హించిన‌ట్టు నిరూప‌ణ‌లు చూపిస్తే శాశ్వ‌తంగా రాజ‌కీయాల త‌ప్పుకోవ‌డ‌మే కాకుండా.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుంటాను అని.. నిరూపించ‌క‌పోతే టీడీపీ నేత‌లు ఏమి చేస్తారో అని ఛాలెంజ్ విసిరారు.

వెంట‌నే మంత్రి కొడాలి నాని స‌వాల్‌కు ప్ర‌తి స‌వాల్ విసిరారు బోండా ఉమ‌. కే.క‌న్వెన్ష‌న్ హాల్లో క్యాసినో జ‌రిగిన‌ట్టు నిరూపించేందుకు తాము సిద్ధ‌మే అని పేర్కొన్నారు. నిరూపించ‌లేక‌పోయిన‌ట్టే తాను పెట్రోల్ పోసుకోవాడ‌నికి కూడా వెనుకాడ‌ను అని చెప్పారు. నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంటావా..? అని మంత్రి కొడాలి నానికి స‌వాల్ చేసారు. ఇటీవ‌ల క్యాబినెట్‌లో ఏమి జ‌రిగిందో ఏమో కానీ.. నాని ప్ర‌స్టేష‌న్‌లో మాట్లాడుతున్నార‌ని పేర్కొన్నారు.

తాజాగా మంత్రి కొడాలి నాని వ్యాఖ్య‌లపై స్పందించిన టీడీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి బుద్ధా వెంక‌న్న మాట్లాడారు. చేతగాని ద‌ద్ద‌మ్మ‌లు, చ‌వ‌ట‌లు చంద్ర‌బాబుపై మాట్లాడుతూ ఉన్నారు. అరేయ్ కొడాలి నాని నీ భాష ఏమిటి..?  కొడాలి నాని నీ చ‌రిత్ర ఏమిటి రా..?  గుడివాడ‌లో ఆయిల్్ దొంగ‌వి అనే విష‌యం మ‌రిచిపోయామా..? వ‌ర్ల రామ‌య్య నిన్ను లోప‌ల వేసి చిత‌క‌బాదాడు. పోలీసులు లేకుండా ప్లేస్‌, స‌మ‌యం ఫిక్స్ చేయి విజ‌య‌వాడ‌లో కొట్టుకుందాం రా అని స‌వాల్ విసిరారు బుద్ధా వెంక‌న్న‌.

గుడివాడ‌లో వ్య‌భిచారం కంపెనీ తీసుకొచ్చావు. నోటి దూల‌తో కృష్ణ జిల్లా మొత్తం ప‌రువు తీశావు అని.. కొడాలి నాని తోపు అయితే కెమెరా ప‌ట్టుకొని చంద్ర‌బాబు ఇంటికి వెళ్లు చూద్దాం. చంద్ర‌బాబు గేట్ తాకితే కొడాలి నాని శ‌వాన్ని పంపుతా.. మేమ‌న్నా నీ బావ‌, బావ మ‌రిదిల‌మా..? మ‌మ్ముల్ని వాడు, వీడు అంటున్నావు. కొడాలి నాకికి రాజ‌కీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. చంద్ర‌బాబు సీఎం అయిన త‌రువాత కొడాలి నానికి టీడీపీలో ప్ర‌వేశం దొరికిన‌ద‌ని, హ‌రికృష్ణ‌ను మోసం చేశావు. 2004లో టికెట్ ఇచ్చింది చంద్ర‌బాబునాయుడు అని గుర్తు చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: