ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పీఆర్‌సీ స‌మ‌స్య ఎప్ప‌టి నుంచో వెంటాడుతుంది. ఓ వైపు ఉద్యోగ‌స్తుల‌ను.. మ‌రొక వైపు ప్ర‌భుత్వానికి ఈ స‌మ‌స్యతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఎప్ప‌టి నుంచో ఈ స‌మ‌స్య‌కు చెక్ పెడుతామ‌ని ప్ర‌భుత్వం పేర్కొంటుండ‌గా.. ఉద్యోగ‌స్తులు మాత్రం త‌మ స‌మ‌స్య‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ త‌రుణంలో ఏపీ   ప్ర‌భుత్వం పీఆర్‌సీనీ స‌వాల్ చేస్తూ.. ఉద్యోగులు హై కోర్టును ఆశ్ర‌యించిన విష‌యం విధిత‌మే. ఈ పిటిష‌న్‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టింది. పీఆర్‌సీ పిటిష‌న్‌పై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసిన‌ది. ముఖ్యంగా ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జీతాలు పెంచే అధికారం.. త‌గ్గించే అధికారం ప్ర‌భుత్వాల‌కు త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ హై కోర్టు స్ప‌ష్టం చేసింది.

ఏపీలో పీఆర్‌సీ స‌మ‌స్య ఎప్ప‌టి నుంచో కొన‌సాగుతుంది.ఇక ప‌ర్సంటేజ్‌ల‌పై చేసే హ‌క్కు ఉద్యోగుల‌కు లేదు అని కోర్టు తేల్చి చెప్పింది. అయితే కోర్టు మాత్రం మీకు ఎంత జీతం త‌గ్గిందో చెప్పాల‌ని ప్ర‌శ్నించింది. పూర్తి స‌మాచారం లేకుండా ఇలా పిటిష‌న్ ఎలా వేస్తారు అని హై కోర్టు ప్ర‌శ్నించింది. పీఆర్‌సీ నివేదిక బ‌య‌టికి రాకుంటే ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించాల‌ని సూచించింది హైకోర్టు. మ‌రొక వైపు ఉద్యోగుల‌కు వేత‌నాలు పెరిగాయి అని.. లెక్క‌ల‌తో కోర్టుకు తెలిపారు.  ప్ర‌భుత్వం త‌రుపున అడ్వ‌కేట్ జన‌ర‌ల్ న్యాయం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని స్ప‌ష్టం చేసారు.

మ‌రొక వైపు పీఆర్‌సీ పిటిష‌న్‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ హై కోర్టు కీల‌క ఆదేశాల‌ను జారీ చేసిన‌ది. పూర్తి స‌మాచారం లేకుండా పిటిష‌న్ ఎలా పిటిష‌న్ వేస్తారు అని ప్ర‌శ్నించింది. ఇందుకు సంబంధించి పిటిష‌న‌ర్ కృష్ణ‌య్య తో పాటు స్క్రీమింగ్ క‌మిటీ స‌భ్యుల‌ను జ‌డ్జీ ముందుకు హాజ‌రు కావాల‌ని న్యాయ‌స్థానం ఆదేశాల‌ను జారీ చేసిన‌ది. స‌మ్మె నోటీసులు ఇచ్చిన 12 మంది క‌మిటీ స‌భ్యుల‌కు కూడా విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని కోర్టు సూచించింది. దీనికి సంబంధించిన త‌దుప‌రి విచార‌ణ‌ను  వాయిదా వేసింది.  ఇవాళ సాయంత్రం వ‌ర‌కు    తీర్పు ఇవ్వ‌నుంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: