అమాయ‌క ప్ర‌జ‌ల‌ను మోసం చేయడం ఇది పూర్వ‌కాలం నుంచి ఆన‌వాయితిగా వ‌స్తుంది. మోసం అనేది ఎప్ప‌టి నుంచో ఉన్న వ్య‌వ‌హారం. మాన‌వుడు పుట్టిన‌ప్పుడే మోసం అనేది పుట్టింద‌నే చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా ఎవ‌రైనా తెలివి త‌క్కువ అమ‌యాక ప్ర‌జ‌లు ఉంటే వారు మోస‌పోవ‌డంలో ఎలాంటి ఆంత‌ర్య‌మే లేదు. తాజాగా త‌మ‌కు ఎక్కువ వ‌డ్డీ డ‌బ్బులు, లోన్లు ఇస్తామ‌ని ఆశ‌చూపి వారి వ‌ద్ద నుంచి కోట్ల రూపాయ‌ల డ‌బ్బును కొంద‌రు అక్ర‌మార్కులు మాయ మాట‌లు చెప్పి లాక్కున్నారు.

ముఖ్యంగా ప్రైవేట్ కో ఆప‌రేటివ్ సొసైటీ పేరుతో ఓ సంస్థ‌నే స్థాపించి ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి కోట్లాది రూపాయ‌ల‌ను కొల్ల‌గొట్టారు. ఆ త‌రువాత బోర్డు తిప్పేశారు. ఈ ఘ‌ట‌న క‌ర్నూలు జిల్లాలో సోమ‌వారం వెలుగులోకి వ‌చ్చిన‌ది. క‌ర్నూలు జిల్లా కోడుమూరులో ముద్ర అగ్రిక‌ల్చ‌ర్ స్కిల్స్ డెవ‌ల‌ఫ్‌మెంట్ మల్టీ స్టేట్స్ కో ఆప‌రేటివ్ సొసైటీ ప్ర‌యివేటు లిమిటేడ్ పేరుతో ఒక ప్రైవేట్ కో ఆప‌రేటివ్ సొసైటీ సంస్థ సూక్ష్మ‌రుణాలను భారీ వ‌సూళ్ల‌కే పాల్ప‌డిన‌ది.

కోడుమూరు ప్రాంత‌లో ఉన్న‌టువంటి రైతులు, సామ‌న్య ప్ర‌జ‌లు, చిరు వ్యాపారుల ఇలా వారి వ‌ద్ద నుంచి డైలీ క‌లెక్ష‌న్ పేరుతో గ‌త కొద్ది నెల‌లుగా కోట్ల రూపాయ‌లను సేక‌రించింది ముద్ర అగ్రిక‌ల్చ‌ర్ అండ్ స్కిల్ డెవ‌ల‌ఫ్‌మెంట్ పేరుతో డ‌బ్బును పోగు చేసుకుంది ప్రైవేటు కో ఆప‌రేటివ్ సొసైటీ సంస్థ‌. ఆ త‌రువాత బోర్డు తిప్పి వేయ‌డంతో ప్ర‌జ‌లు మోస‌పోయామ‌మ‌ని బోరున విల‌పిస్తున్నారు. కొన్ని నెల‌ల కాలం నుంచి  ముద్ర అగ్రిక‌ల్చ‌ర్ స్కిల్స్ అండ్ డెవ‌ల‌ఫ్‌మెంట్ మ‌ల్టీస్టేట్స్ కో ఆప‌రేటివ్ సొసైటీ ప్రైవేట్ లిమిటేడ్ సంస్థ కార్యాల‌యం మూసి ఉండ‌డంతో మోస‌పోయిన‌ట్టు గ్ర‌హించారు బాధితులు. ఆరుగాలం క‌ష్ట‌ప‌డి పైసా పైసా కూడ‌బెట్టి సంపాదించుకున్న డ‌బ్బును కో ఆప‌రేటివ్ సొసైటీ  మాయ‌మాట‌లు చెప్పి కాజేసి మా నెత్తిన కుచ్చుటోపినే పెట్టింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు బాధితులు.

మ‌రొక‌వైపు ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు. క‌ర్నూలు జిల్లాలో కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేసిన ముద్ర యాజ‌మాన్యం. మొత్తం రాయ‌ల‌సీమ ప్రాంతంలో రూ.100 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఏపీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ముద్ర సంస్థ‌కు ప‌లు బ్రాంచ్‌లున్నాయి. ముఖ్యంగా రెండు రాష్ట్రాల‌లో కూడా ప‌లు చోట్ల బోర్డులు తిప్పేసిన‌ట్టు వార్త‌లు రావ‌డంతో ల‌క్ష‌లాది మంది బాధితులు ఆ సంస్థ‌కు సంబంధించిన కార్యాల‌యాల‌కు చేరుకుంటున్నారు.  కొంత మంది మోస‌పోయిన‌ పేద ప్ర‌జ‌లు ల‌బోదిబోమ‌ని బోరున విల‌పిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: