యూపీలో మజిలీస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోతోంది..? తెలంగాణలో మిత్రపక్షమైన టిఆర్ఎస్ పరోక్షంగా అఖిలేష్ కు మద్దతు తెలపడంతో ఓవైసీ  కూడా ఎస్పీకి సంఘీభావం పలుకుతారా? దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్  లో వచ్చే నెలలో ఎన్నికలు జరుగుతున్నాయి. అటు బీజేపీ నుంచి యోగి, ఇటు సమాజ్వాది పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్ పోటాపోటీ ప్రచారాలతో యూపీ వేడెక్కుతోంది. బీఎస్పీ నుంచి మాయావతి బరిలో నిలువుకున్నా తమ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ప్రకటించడంతో మూడు ప్రధాన పార్టీలు అక్కడి రాజకీయాన్ని రంజుగా మారుస్తున్నాయి. ఈ మూడు పార్టీల మధ్య లోనే నేనున్నానంటూ మజ్లిస్ కూడా రావడం, తమకు పట్టున్న 100 నియోజకవర్గాల్లో పోటీకి సై అనడంతో పొలిటికల్ హీట్ అంతకంతకు పెరుగుతోంది.

 ఉత్తరప్రదేశ్ లో గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మజ్లీస్ అధినేత అసారుద్దీన్ ఓవైసీ కీలక ప్రకటన చేశారు. యూపీలో బాబు సింగ్ కుశ్వాహ, భారత్ ముక్తి మోర్చా తో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. తమ కూటమి యూపీలో అధికారంలోకి వస్తే ఇద్దరు సీఎంలు ఒకరు ఓబీసీ మరొకరి దళిత వర్గం నుంచి ఉంటారన్నారు. ముస్లిం వర్గానికి చెందిన ముగ్గురిని డిప్యూటీ సీఎంగా చేస్తామన్నారు అసారుద్దీన్. బీహార్ మహారాష్ట్రలో ఖాతా తెరిచిన హైదరాబాద్ కు చెందిన ఎంఐఎం పార్టీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కూడా అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. తాము ఎస్పీతో కానీ, బీఎస్పీతో కానీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ పరోక్షంగా కుండ బద్దలు కొడుతోందట. తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీకి, మజ్లీస్ పార్టీ మిత్రపక్షం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికైనా, సాధారణ ఎన్నికలు పాతనగరంలో జరిగినప్పుడైనా ఈ రెండు పార్టీలు ఓ అండర్స్టాండింగ్ కి వస్తాయి. పాతబస్తీలో టిఆర్ఎస్ ఎక్కడ వీక్ గా ఉంటే అక్కడ ఎంఐఎం మద్దతు ఇవ్వడమో లేదంటే మజ్లీస్ అభ్యర్థిగా ఓపెన్ గా సపోర్ట్ నిలవడమో ఇలా రెండు పార్టీలు ఒక ఒప్పందం ప్రకారం నడుచుకుంటాయి. ఇక అసలు విషయానికొస్తే యూపీలో బిజెపికి చెక్ పెట్టేందుకు గులాబీ బాస్ సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఎస్పీ అధినేత మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కు పరోక్షంగా మద్దతు ఇచ్చేందుకు నిర్ణయించారు. సెక్యులర్ పార్టీలు ఏకమైతే కమలనాథులకు కళ్లెం వేయొచ్చని పిలుపునిచ్చారు.

కానీ ఎస్పీ కి సపోర్ట్ గా ఉండాలని తనకు మిత్రపక్షమైన మజ్లిస్ ను ఒప్పించలేకపోయారన్న చర్చ నడుస్తోంది. తెలంగాణలో ఉన్న ఫ్రెండ్ షిప్ ను యూపీలో కూడా ఎన్నికలయ్యేదాకా కంటిన్యూ చేస్తూ బిజెపిని గద్దె దించేతే బాగుంటుందని మెప్పించలేకపోయారట. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటూ ఓవైసీ చెప్పడంతో కేసీఆర్ కూడా ఏమనలేక పోయారట. అటు అఖిలేష్, ఆపై మాయావతి. అటు అప్పట్లో అఖిలేష్ దూతగా వచ్చాడని చెబుతున్న తేజస్వికి కూడా ఈ మేరకు మాట ఇవ్వలేకపోయారన్న చర్చ జరుగుతోంది. మరి  యూపి లో తన దారి రహదారి అంటున్న ఓవైసీ ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: