రాజకీయాల్లో ఎన్నికల బరిలో దిగని నేతలు కొందరు ఉంటారు...వారు రాజకీయంగా సలహాలు ఇవ్వడానికి, అధినేతలకు సపోర్ట్‌గా ఉంటూ పార్టీలని బలోపేతం చేయడానికి కృషి చేస్తారు. ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగకపోయినా సరే, పరోక్షంగా పార్టీ గెలుపు కోసం సహకరిస్తారు. అలాంటి నేతల వల్ల రాజకీయంగా బెనిఫిట్ ఉంటుంది. కానీ అలా పోటీ చేయని నేతలు సరైన సలహాలు ఇవ్వకుండా, ఎంతసేపు భజన చేస్తూ, పదవులు కొట్టేయాలని చూస్తూ, రాజకీయంగా పెత్తనం చెలాయిస్తూ ఉంటే, వారి వల్ల పావలా ఉపయోగం ఉండదు. పైగా పార్టీకే డ్యామేజ్ జరుగుతుంది.


ఇలా రాజకీయంగా పనికిమాలిన సలహాలు ఇస్తూ, అధినేతలకు భజన చేస్తూ, పదవులు తెచ్చుకుంటున్న నేతలు అటు వైసీపీలో, ఇటు టీడీపీలో కూడా ఉన్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు చుట్టూ ఎంతమంది భజన నేతలు ఉన్నారో చెప్పాల్సిన పని లేదు....అసలు వారి పని ఏమి లేదు. ఎలాగో ఎన్నికల్లో పోటీ చేయరు కదా...ఇంకా ఎమ్మెల్సీ పదవులో, నామినేటెడ్ పదవులో, ఇంకా ఇతర పదవులో దక్కించుకోవడానికి, చంద్రబాబు చుట్టూ చేరి భజన చేసేవారు. అలాగే క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్తితి బాగోకపోయినా సరే, ఆహా..ఓహో మీ పాలన అద్భుతం అంటూ పొగిడేవారు.


ఈ దెబ్బతో బాబుకు క్షేత్ర స్థాయిలో పరిస్తితులు అర్ధం కాలేదు..దీంతో టీడీపీకి భారీ డ్యామేజ్ జరిగింది...ఇప్పటికీ ఆ భజన బ్యాచ్ టీడీపీలో ఉంది. వారు మళ్ళీ అదే భజన పనిలో ఉన్నారు. పైగా నారా లోకేష్‌కు కూడా భజన చేసే పనిలో ఉన్నారు.


ఇటు వైసీపీలో జగన్‌కు భజన చేసే వారి గురించి చెప్పక్కర్లేదు. అలాగే పార్టీకి నాలుగు ఓట్లు కూడా తీసుకురాని నేతలు...ఎంతమంది పదవుల్లో కొనసాగుతున్నారో తెలిసిందే. అలాగే క్షేత్ర స్థాయిలో పరిస్తితులు తెలియనివ్వకుండా భజన చేసేది ఎవరో కూడా తెలిసిందే. ఇలా చంద్రబాబు-జగన్‌లు చుట్టూ భజన నేతలు ఎక్కువ ఉన్నారు. వీరి వల్ల ఆయా పార్టీలకు డ్యామేజ్ తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి: