ఒకప్పుడు భారత ప్రభుత్వం నుంచి రక్షణ రంగ పరిశోధనా సంస్థ డీఆర్డీవో కి అందిన మద్దతు అంతంత మాత్రమే. అందుకే  శాస్త్రవేత్తలు ఆయుధాలను తయారు చేసే సత్తా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుండి ప్రోత్సాహం లేకపోవడం ఇక నిధులు కూడా సరైన నిధులు కూడా రాకపోవడంతో ఎప్పుడో ఒకసారి మాత్రమే ఆయుధ తయారీకి పూనుకునే వారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి మద్దతు అందుతుంది. అంతేకాదు ఇక భారత రక్షణరంగ పరిశోధనా సంస్థకు  భారత ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది. దీంతో తమ సత్తా ఏమిటో ప్రపంచానికి చూపించేందుకు వైద్య శాస్త్రవేత్తలు ఎప్పుడు వినూత్న ఆలోచనలతో ముందడుగు వేస్తూనే ఉన్నారు.


 ఇటీవలి కాలంలో డిఆర్డిఓ  శాస్త్రవేత్తలు ఎన్నో మిసైల్స్ అభివృద్ధి చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారూ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే పదికిపైగా క్షిపణులను తయారుచేసి వాటికి ప్రయోగాల నిర్వహించి భారత అమ్ముల పొదిలో చేర్చింది డి ఆర్ డి ఓ. భారత్ తయారుచేసిన అద్భుతమైన క్షిపణుల లో    బ్రహ్మోస్ కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. ఎంతో అద్భుతంగా బ్రహ్మోస్  అభివృద్ధి చేసిన భారత్ ఈ మిస్సైల్ ద్వారానే ఆయుధ వ్యాపారం కూడా చేపడుతూ ఉండటం గమనార్హం. అయితే ఇప్పటికి బ్రహ్మోస్ లాంటి ఒక అద్భుతమైన మిసైల్ ను  అభివృద్ధి చేసిన డిఆర్డిఓ ఇక ఇప్పుడు మరో సంచలన క్షిపణి అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది అని తెలుస్తోంది. ఇందులో పన్నెండు వేల కిలోమీటర్ల రేంజ్ లో అగ్ని అనే మిస్సైల్ ని అభివృద్ధి చేసిందట. దీనికి సంబంధించి ప్రయోగాలు వచ్చే నెలలో జరగబోతున్నాయట. అగ్ని 6 ఐసిబిఎం 80% ప్రపంచాన్ని కవర్ చేయ కలిగినటువంటి శక్తివంతమైంది అనే విషయం ఇపుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. పన్నెండు వేల కిలోమీటర్ల సామర్థ్యం లో దాడి చేయగల సత్తా కలిగిన అగ్ని మిస్సైల్ ను 16 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా సమర్థవంతంగా చేదించే  విధంగా ఇక్కడ ఈ మిస్సైల్   అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. అగ్ని మిస్సైల్ పరీక్ష సక్సెస్ అయ్యిందంటే ఇక చైనా కు ధీటుగా ఎదుర్కునేందుకు ఉపయోగపడుతుంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: