ప్రతి ఒక్కరికి కార్ కొనాలని ఆశ ఉంటుంది. సంపన్నులు అయితే కార్ కొనాలి అనిపించింది అంటే చాలు వెంటనే వెళ్లి కారు కొనుగోలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ సామాన్యులు మాత్రం కారు కొనుగోలు చేయాలి అంటే ఎన్నో రకాలుగా ఆలోచన చేయాల్సి ఉంటుంది. కొన్ని రోజులపాటు డబ్బులు పోగు చేసుకుని కారు కొనుగోలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే సామాన్య ప్రజలు ఇలా కారు కొనుగోలు చేయాలనే కలను నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంతమంది కొత్త కారు కొనుగోలు చేయడం కంటే సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేస్తే బాగుంటుంది కదా అని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ఇలా సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది అని చెప్పాలి.


 తక్కువ ధరలోనే సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేస్తూ ఎంతోమంది కార్ కొనాలనే కలను  నెరవేర్చుకున్నారు. అయితే సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేయడం మంచిదే కానీ సెకండ్ హ్యాండ్ కార్ల విషయంలో మోసపోతే మాత్రం చివరికి డబ్బులు మొత్తం లాస్ అయినట్లే అవుతుంది అని అంటున్నారు ఎంతోమంది. అందుకే సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయాలి అని భావించినప్పుడు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని సూచిస్తున్నారు. ఒకవేళ ఇలా సెకండ్ హ్యాండ్ కార్ కొనుగోలు చేయాలి అని భావిస్తే ఇక ఈ కింద చెప్పిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలి అని సూచిస్తున్నారు.



 ముందుగా సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయాలి అనే ఆలోచన ఉన్నప్పుడు కార్ కొనేందుకు  వెళ్తున్నప్పుడు నమ్మకస్తుడైన ఒక మెకానిక్ నూ వెంట తీసుకెళ్లడం ఎంతో బెటర్. అంతేకాకుండా కార్ రియల్ టైం కండిషన్ తెలుసుకునేందుకు కనీసం 20 కిలోమీటర్ల వరకు టెస్ట్ డ్రైవ్ చేస్తే కారు అసలు కండిషన్ తెలిసే అవకాశం ఉంటుందట. అంతేకాకుండా కార్ సైలెన్సర్ నుంచి  బ్లూ లేదా బ్లాక్ రంగులో పొగ వస్తే ఇక ఇంజన్లో ఆయిల్ లీకేజ్  సమస్య ఉన్నట్లు గుర్తించాలట. ఇక డాక్యుమెంట్లు సరిగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎలాంటి ఇన్సూరెన్స్ ఉంది అన్నది కూడా చూసుకోవాలట. మైలేజ్ మీ కుటుంబానికి ఏది అవసరమో బడ్జెట్ ను బట్టి కార్ ను ఎంపిక చేసుకోవడం బెటర్ అంటూ సూచిస్తున్నారు ఎంతోమంది నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: