ఈ నెల 31 నుంచి పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే.. జనవరి 31 నుంచి బడ్జెట్ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ ప్రకటించనున్నట్టు తెలిపారు.. బడ్జెట్ టెన్షన్ ఒకవైపు, కరోనా టెన్షన్ మరో వైపు నేతలకు పట్టుకుంది. గత ఏడాది ఎలాగైతే లోక్‌ సభ, రాజ్యసభ రెండు వేరు వేరు సమయాల్లో నడిపేందుకు సిద్ధం అవుతున్నారు. అప్పుడు కరోనా భయం తగ్గుతుందని అంటున్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభల ను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం జనవరి 31వ తేదీన ఉంటుందని కేంద్ర ప్రభుత్వం పెర్కొంది. 



ఇకపోతే వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి లోక్‌సభ, రాజ్యసభ రోజుకు ఐదేసి గంటల పాటు.. వేర్వేరు సమయాల్లో నడుస్తాయని తెలుస్తుంది. ముందుగా లోక్ సభ ఫిబ్రవరి 1 న ఉదయం 11 కు 

లోక్‌సభ బడ్జెట్ వివరాల ను ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 11 వ తేదీ నాలుగో తేదీ వరకు సమావేశాలు కొనసాగుతున్నాయ ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించారు.రాజ్యసభ సమయం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకూ ఉంటుందని చెప్పుకొచ్చింది.



అలాగే మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకూ రెండో దశ సెషన్ల ను మొదలు కానున్నాయి. కాగా, గత ఏడాది తో పోలిస్తే సమావేశం సమయం ను కుదించినట్లు తెలుస్తుంది. పార్లమెంట్ పనివేళల గురించి మరో బులిటెన్ ను లోక్‌సభ సచివాలయం విడుదల చేసింది. సెట్రల్‌ హాల్‌ నుంచి రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ పార్లమెంటు ఉభయ సభల ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కోవిడ్  దృష్ట్యా లోక్‌సభ, రాజ్య సభ సభ్యులు భౌతిక దూరం పాటించేలా సభలొని సీట్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఈ నెల 31 నుంచి సమావేశాలు  వేడేక్కనున్నాయి.. మరి ఎ శాఖకు ఎంత బడ్జెట్ ను కేటాయిస్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: