ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం సంపాదించాలని నేటి రోజుల్లో ఎంతోమంది యువకులు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ ఆర్మీ ఉద్యోగాలకు సంబంధించి ఎప్పుడు ఎప్పుడు నోటిఫికేషన్ లు పడతాయి అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇలా ఎదురు చూస్తున్న వారందరికీ ఇటీవలే ఒక గుడ్ న్యూస్ అందింది. ఇండియన్ ఆర్మీ టెన్ ప్లస్  టెక్నికల్ ఎంట్రీ స్కీం కింద 2022 సంవత్సరానికి 47 కోర్సులో ప్రవేశించడానికి గానూ  అవివాహిత పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి అంటూ ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఎంతో మంది యువకులు ఇక ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమైపోతున్నారు.


 ఇలా దరఖాస్తు చేసుకున్న వారికి అయిదేళ్ల శిక్షణ ఇస్తారు. ఇక ఆ తర్వాత ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు నియామకం జరుగుతుందని తెలుస్తుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో వెంటనే దరఖాస్తు చేసుకునేందుకు ఒక వెబ్సైట్ కు కూడా అందుబాటులో ఉంచారు. ఇప్పటికే దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రారంభం కాగా ఫిబ్రవరి 23వ తేదీ ఇక ఈ దరఖాస్తులకు చివరి రోజు అని తెలుస్తోంది. ఇక అభ్యర్థులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను  https://joinindianarmy.nic.in/ వెబ్ సైట్ లో చూసేందుకు అవకాశం ఉంది.


 ఇక ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పోస్టు వివరాలు: ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ లో ఖాళీల సంఖ్య: 90
పే స్కేల్: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు ఉంటుంది.
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. అంతే కాకుండా  ఫిజిక్స్, కెమిస్ట్రీ సహా గణితం సబ్జెక్టులుగా ఉండాలి. తప్పనిసరిగా JEE Main 2021 పరీక్షకు హాజరైయుండాలి. నోటిఫికేషన్లో సూచించిన విధంగా శారీరక ప్రమాణాలు కచ్చితంగా ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధులు జనవరి 2, 2003 నుంచి జనవరి 1, 2006 మధ్య పుట్టిన వారు అయి ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూ మొత్తం 5 రోజులు జరుగుతుంది. ఈ సమయంలో వివిధ స్టేజుల్లో అభ్యర్ధులను పరీక్షిస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: ఫిబ్రవరి 23, 2022 కావడం గమనార్హం.
పూర్తి వివరాలకు ఈ కింద  వెబ్‌సైట్‌:https://joinindianarmy.nic.in/ లో చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: