నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అరవింద్ తో పాటు బీజేపీ నాయకుల పై టీఆరెస్ కార్య కర్తల దాడిని ఖండించారు  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. బండి సంజయ్ కుమార్. ఎంపీ అరవింద్ కు ఫోన్ చేసి మాట్లాడిన బండి సంజయ్ కుమార్..  నిజామాబాద్ పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు.  రాజాకర్ లాగా వ్యవ హరిస్తున్నారని.. అన్ని శాఖలని గుప్పిట్లో పెట్టుకుని క్రూ రంగా కేసీఆర్ వ్యవహరి స్తున్నాడని నిప్పులు చెరిగారు బండి సంజయ్ కుమార్..  జిల్లా జిల్లాకు నిబంధనలు మారుతాయా?  గౌరవ ఎంపీ ఫోన్ చేసినా పోలీసులు స్పందించారా?  అని నిలదీశారు బండి సంజయ్ కుమార్.  అటు  కేసీఆర్‌ సర్కార్‌ పై  మాజీ మంత్రి ,బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు.


 నిజామాబాద్ జిల్లా ఇస్సాపల్లి లో పార్లమెంట్ సభ్యులు అరవిం ద్ ధర్మపు రి తో పాటు బీజేపీ నాయకుల పై టీఆరెస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు  డికె అరుణ.  కారు అద్దాలు పగల గొట్టి దాడి చేయడం హత్యాయత్నానికి పాల్పడిన టిఆర్ఎస్ కార్యకర్తల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు  డికె అరుణ. పోలీసు యంత్రాంగం సాక్షిగా దాడి జరగడం దారుణం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతలపై టీఆర్ఎస్   ప్రోత్స హించడం సిగ్గు చేటు అని ఆగ్రహించారు  డికె అరుణ.  అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తున్న పార్లమెం టు సభ్యుల పై ప్రజా ప్రతినిధులపై దాడులను ప్రోత్సహించడానికి నియంతృత్వానికి ప్రతీక అన్నారు  డికె అరుణ. దాడులతో బిజెపి కార్యకర్తలను నాయకులను భయపెట్టాలని టిఆర్ఎస్ అధినేత భావిస్తే మరింత ఉదృతంగా కార్యకర్తలు టిఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానా లను ప్రజల్లోకి తీసు కెళ్తామని స్పష్టం చేశారు  డికె అరుణ.  ఇలాంటి దాడులకు బిజెపి భయపడే ప్రసక్తే లేదని వెల్డించారు  డికె అరుణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp