టీడీపీ అధినేత చంద్రబాబు అంటే రెడ్డి సామాజికవర్గం నేతలకు కాస్త రెస్పెక్ట్ ఎక్కువనే చెప్పాలి. అదేంటి అసలు బాబుకు రెడ్డి వర్గం నేతలే ప్రధాన శత్రువులుగా ఉన్నారు కదా..మరి వాళ్ళు బాబు అంటే రెస్పెక్ట్‌తో ఎందుకు ఉంటారని అందరికీ డౌట్ రావొచ్చు. నిజమే రెడ్డి నేతలే బాబుకు ప్రధాన శత్రువులుగా ఉన్నారు. ఇప్పుడు జగనే బాబుతో తలపడుతున్నారు. వారిద్దరి మధ్య పోరు తీవ్ర స్థాయిలో నడుస్తోంది. పైగా వైసీపీలో పూర్తిగా రెడ్డి నేతలదే హవా. ఇందులో కూడా ఎలాంటి డౌట్ లేదు. అయితే రెడ్డి నేతలు రాజకీయంగానే శత్రువులు తప్ప, పెద్దగా చంద్రబాబుని వ్యక్తిగతంగా కించపరిచిన సందర్భాలు లేవనే చెప్పాలి.

అసలు చంద్రబాబు సొంత సామాజికవర్గమైన కమ్మ నేతలే కించపర్చడం, బూతులు తిట్టడం చేస్తున్నారు గాని, రెడ్డి నేతలు పెద్దగా బూతులు తిట్టిన సందర్భాలు తక్కువ. వైసీపీలో ఉన్న కొడాలి నాని గాని, వైసీపీలోకి వచ్చిన వల్లభనేని వంశీ గాని...చంద్రబాబుని ఏ స్థాయిలో తిడతారో చెప్పాల్సిన పని లేదు. అసలు రాయలేని బాషలో బాబుని తిడతారు. కానీ ఈ స్థాయిలో రెడ్డి నేతలు మాత్రం తిట్టిన సందర్భాలు తక్కువ.

అలాగే ఇతర వర్గాల నేతలు సైతం కాస్త ఘాటుగానే బాబుని విమర్శిస్తారు...కానీ రెడ్డి నేతలు అంతగా విమర్శించిన సందర్భాలు లేవు. ఏదో ఇద్దరు, ముగ్గురు నేతలు తప్ప మిగిలిన రెడ్డి నేతలంతా రాజకీయ పరంగా విమర్శలు చేస్తారు తప్ప, వ్యక్తిగతంగా మాత్రం బాబుని తిట్టారు. ఉదాహరణకు రాయలసీమ జిల్లాలో ఎక్కువగా రెడ్డి ఎమ్మెల్యేలే ఉన్నారు..పైగా అందరూ వైసీపీ ఎమ్మెల్యేలే. వీరు ఎప్పుడు బాబుని పెద్దగా తిట్టలేదు.

ఆఖరికి కడప జిల్లాలో ఉన్న రెడ్డి ఎమ్మెల్యేలు కూడా బాబుని తిట్టిన సందర్భాలు తక్కువ. కాకపోతే రాజకీయ పరమైన విమర్శలు మాత్రం చేస్తుంటారు. అంతే గాని కొడాలి నాని మాదిరిగా మాత్రం ఎప్పుడు తిట్టలేదు. అంటే కాస్తో, కూస్తో రెడ్డి నేతలు బాబుకు రెప్సెక్ట్ ఇస్తున్నారని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

tdp