గణబాబు టీడీపీ ఎమ్మెల్యే..పేరుకు టీడీపీ ఎమ్మెల్యేగాని, ఈయన టీడీపీలో పెద్దగా కనిపించరు. పైగా వేరే పార్టీలకు సపోర్ట్‌గా ఉండరు. ఈయనదొక సెపరేట్ స్టైల్..ఏదో ఇండిపెండెంట్ మాదిరిగా ముందుకెళుతుంటారు. ఇప్పుడు అని కాదు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈయన వరుస ఇంతే...ఏదో అధికార పార్టీ ఎమ్మెల్యేల మాదిరిగా పెత్తనాలు చేయడం చేయరు. తన పని ఏదో తాను చేసుకుంటూ వెళ్లిపోతారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కూడా అదే పనిలో ఉన్నారు.

అయితే విశాఖపట్నం టీడీపీలో కీలక నేతగా ఉన్న గణబాబు...2009లో విశాఖ వెస్ట్ నుంచి ప్రజారాజ్యం తరుపున పోటీ చేసి ఓడిపోయారు...ఇక ఆ తర్వాత టీడీపీలోకి వచ్చేశారు...2014లో టీడీపీ నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో సైతం వెస్ట్ బరిలో టీడీపీ నుంచి గెలిచారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండటంతో ఈయనని లాగడానికి వైసీపీ గట్టిగానే ప్రయత్నాలు చేసింది...అలాగే పలు రకాల కారణాలతో ఈయన్ని లొంగదీసుకోవడానికి చూశారు. కానీ పక్కనే ఉన్న విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్...వైసీపీ వైపుకు వెళ్లారు గాని, గణబాబు మాత్రం వైసీపీ వైపుకు వెళ్లలేదు.


అలా అని ఈయన ఏమి టీడీపీ తరుపున గట్టిగా పోరాటాలు కూడా చేయరు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయరు. ఏదైనా సమస్యలు ఉంటే ప్రశ్నిస్తారు తప్ప...విమర్శల జోలికి వెళ్లరు. అందుకే అనుకుంటా వైసీపీ సైతం ఈయనని ఎక్కువగా టార్గెట్ చేసినట్లు కనిపించదు. ఇలా న్యూట్రల్‌గా రాజకీయాలు చేస్తున్న గణబాబు...నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాంటి స్టెప్ తీసుకుంటారు..అసలు ఈయన మళ్ళీ టీడీపీలోనే పోటీ చేస్తారా? లేక రూట్ మార్చి వేరే పార్టీలోకి జంప్ చేస్తారా? అంటే ఈ విషయంపై ఇప్పుడే క్లారిటీ వచ్చేలా లేదు.

కాకపోతే రాజకీయంగా వెస్ట్‌లో గణబాబు బలంగానే ఉన్నారు..ఈయన ప్రత్యర్ధిగా ఉన్న వైసీపీ నేత మళ్ళ విజయ్ ప్రసాద్ అంతగా పికప్ అయినట్లు కనిపించడం లేదు. మరి చూడాలి వెస్ట్‌లో ఈ సారి గణబాబు ఎలాంటి రాజకీయం నడిపిస్తారో.

మరింత సమాచారం తెలుసుకోండి: