గతంలో కాంగ్రెస్ పార్టీ బలమే ఇప్పుడు వైసీపీ బలం అని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమైన ఓటు బ్యాంక్ మొత్తం వైసీపీకి వచ్చేసింది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, రెడ్డి, ముస్లిం ఓటు బ్యాంక్ పూర్తి స్థాయిలో వైసీపీకి షిఫ్ట్ అయింది. అయితే బీసీ ఓటు బ్యాంక్ మొదట నుంచి టీడీపీకి ఎక్కువ సపోర్ట్ ఉండేది. కాపులు వచ్చేసరికి పరిస్తితులు బట్టి ఒకోసారి ఒకో పార్టీకి సపోర్ట్ చేసేవారు. అయితే గత ఎన్నికల్లో అన్నీ వర్గాలు వైసీపీకే మద్ధతు ఇచ్చాయి. అందుకే వైసీపీకి భారీ మెజారిటీ వచ్చింది.

ఇక వైసీపీ అధికారంలోకి వచ్చింది...జగన్ పాలన రెండున్నర ఏళ్లుగా ప్రజలు చూస్తూనే ఉన్నారు. అయితే రెండున్నర ఏళ్లలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. కొన్ని వర్గాలు వైసీపీకి వ్యతిరేకం అవుతున్నాయి. అయితే వైసీపీకి బలమైన సపోర్ట్‌గా ఉన్న ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంక్ జగన్‌కు వ్యతిరేకమవుతున్నారు. అంటే జగన్ వచ్చినా సరే తమకు ఒరిగింది ఏమి లేదనే భావనలో ఎస్సీ, ఎస్టీలు ఉన్నట్లు కనిపిస్తున్నారు. పైగా దళితులపై దాడులు కూడా పెరిగాయి.

అన్నిటికంటే వైసీపీ ప్రభుత్వంలో వింత ఏంటి అంటే..ఎస్సీలపైనే ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం. ఇది జగన్ ప్రభుత్వంలోనే జరిగింది. ఇలా అనేక రకాలుగా ఎస్సీలు వైసీపీపై కోపం పెంచుకుంటున్నారు. అందుకే ఎస్సీ రిజర్వడ్ స్థానాల్లో వైసీపీ బలం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో రెండు స్థానాలు మినహా మిగిలిన అన్నీ స్థానాలు వైసీపీనే గెలుచుకుంది. కానీ ఇప్పుడు ఆ స్థానాల్లోనే వైసీపీపై వ్యతిరేకత పెరిగే పరిస్తితి కనిపిస్తోంది.

ఏదో నాలుగైదు నియోజకవర్గాల మినహా, మిగిలిన స్థానాల్లో వైసీపీకి రివర్స్ అయ్యే పరిస్తితి. పైగా వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కూడా తీవ్రంగా పెరుగుతుంది. ఈ పరిస్తితులని బట్టి చూసుకుంటే నెక్స్ట్ ఎన్నికల్లో ఎస్సీ స్థానాల్లో వైసీపీ పరిస్తితి రివర్స్ అయ్యేలా ఉంది..ఈ స్థానాల్లో టీడీపీ సత్తా చాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: