తెలుగు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఎప్పుడూ ఏదొక వివాదం తో వార్తల్లొ నిలిచాడు. అలా సినిమాల కన్నా కూడా ఎక్కువగా ఫెమస్ అవుతున్నారు.. అయితే వర్మ సినిమాలు కూడా అంతే.. రాజకీయ రచ్చలకు కెరాఫ్ గా వున్న సినిమాలను మాత్రమే ఎక్కువగా తెరకెక్కిస్తున్నారు. గతంలో వచ్చిన సినిమాలు అయితే ఎంత వేడిని పుట్టించాయి అనేది అందరికి తెలుసు.. ఆ తర్వాత బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులకు అందించారు.


ఇప్పుడు మళ్ళీ రాజకియాల వైపు ఆలొచనలు చేస్తున్నారు. ఇప్పుడు వస్తున్న సినిమా తెలంగాణా రచ్చలకు కెరాఫ్ గా మారనుంది.కొండా సురేఖ దంపతుల జీవిత చరిత్రపై బయోపిక్‌ తీశారు. ఈ సినిమాకు కొండా అనే పేరు కూడా పెట్టారు రామ్‌ గోపాల్‌ వర్మ. అయితే.. ఈ సినిమాలో తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి, చల్లా ధర్మారెడ్డికి వ్యతిరేకంగా కొన్ని సన్నీవేశాలను చిత్రీకరించిన సంగతి తెలిసిందే.. అవి కూడా ఒక విధంగా రాజకియల్లొ మంటలు పుట్టిస్తున్నాయి.


అయితే.. కొండా సినిమాను ఆపేందుకు మొదటి నుంచి టీఆర్‌ఎస్‌ నేతలు ఎన్నెన్నో చెస్తున్నారని వర్మ ఆరొపిస్తున్నారు..ఇది ఇలా ఉండగా...తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ ను వర్మ విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్‌ ను కూడా అడ్డుకునేందుకు.. కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖతో కలిసిన ఆర్జీవి ఓ సెల్పీ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోను మంత్రి ఎర్రబెల్లి, చల్లా ధర్మారెడ్డికి కొండా సురేఖ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. తమ సినిమా ట్రైలర్‌ ను మీరు ఆపాలని ప్రయత్నిస్తె మాత్రం నీకు బాగుండదు అంటూ  … బండ బూతులు తిట్టారు. కాగా.. ఇవాళ 10.26 గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ ను విడుదల చేయనున్నారు వర్మ..అది ఎలా వుంటుందో, ఎన్ని రచ్చ లను తెస్తుందొ చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: