రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.   ఈ సందర్భంగా రాజ్ భవన్ లో   జాతీయ జండా ఆవిష్కరించారు గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్. కేంద్ర ప్రభుత్వం ని హై లైట్ చేస్తూ... రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ను పెద్దగా ప్రస్తావించని గవర్నర్..  పీఎం గురించి పొగడ్తలు చేస్తూ... సీఎం పేరే ఎత్తలేదు. మరుగున పడిన వ్యక్తులను గౌరవించడం ద్వారా భారతదేశం తన నిజమైన చరిత్రను వారసత్వాన్ని తిరిగి పొందుతుందన్నారు గవర్నర్ తమిళ్ సై. 150 దేశాలకు భారతదేశం వ్యాక్సిన్ ఇచ్చిందని.. మన దేశం ఫార్మసీ, వ్యాక్సిన్ కాపిటల్ ఆఫ్ వరల్డ్ గా  పిలువబడుతుందని వెల్లడించారు గవర్నర్ తమిళ్ సై. మోడీ కృషి వల్ల ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా ఇచ్చిందని.. కొత్త రాష్ట్రము అయిన తెలంగాణ వివిధ రంగాల్లో దూసుకుపోతుందని చెప్పారు గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్.  


 హైదరాబాద్ ఫార్మా, మెడికల్,ఐటీ హబ్ గా మారింది.. నాణ్యమైన ఉన్నత విద్యలో తెలంగాణ  అగ్రగామిగా ఎదగాలని,  ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ ని ప్రోత్సహించి ఇన్నోవేషన్ హబ్ గా తెలంగాణ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని కోరుకొంటున్నానని వెల్లడించరు గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్. . దేశ స్వావలంబన సాకారం కోసం తెలంగాణ ముందుండాలని కోరుకుంటున్నానని.. పంటలు సమృద్ధిగా పండాయి... రైస్ బౌల్ ఆఫ్ ఇండియా గా తెలంగాణ అవతరించిందని వెల్లడించారు గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్. . రైతులకు నమస్కరిస్తున్నానని.. ప్రభుత్వ హాస్పిటల్స్ సెట్ అప్ అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు గవర్నర్ తమిళ్ సై.  ప్రధాని మోడీ జిల్లాకు మెడికల్ కాలేజి ఇస్తు న్నారు.. తెలంగాణ కి 8 మెడికల్ కాలేజి లు మంజూరు అయ్యాయని గుర్తు చేశారు గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్.

మరింత సమాచారం తెలుసుకోండి: