ప్రస్తుతం ప్రాణాంతకమైన కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అన్నీ దేశాలలో కూడా విజృంభిస్తూ అందరిలో ప్రాణ భయాన్ని కలిగిస్తుంది. అయితే ఇప్పటికే అందరూ కరోనా వైరస్ తో భయంతో వణికి పోతున్న నేపథ్యంలో మరిన్ని కొత్త వ్యాధులు కూడా వెలుగులోకి వస్తు ఆందోళనకర పరిస్థితులు తీసుకు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో కొన్ని కొత్త కొత్త  వ్యాధులు కూడా వెలుగులోకి వస్తు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. అయితే ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా థర్డ్ వేవ్ మొదలయ్యి కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరగడం మొదలైంది. ఇక ఇలాంటి సమయంలో ఇటీవలే కొరియా వ్యాధి ఒకటి తెరమీదికి వచ్చింది.. ఇక ఈ వ్యాధి బారిన పడ్డారు అంటే మన శరీరంలో అవయవాలు మన అదుపులో ఉండవు.


 అచ్చంగా నాగార్జున హీరోగా నటించిన హలో బ్రదర్ సినిమా చూసే ఉంటారు కదా. అందులో ఒకరు ఎలా చేస్తే మరొకరు కూడా అలాగే చేస్తూ ఉంటారు. ప్రమేయం లేకుండా కాళ్ళు చేతులు కదులుతు ఉంటాయ్. ఇక్కడ కూడా వింత  వ్యాధి బారినపడింది. వ్యాధి బారిన పడితే ఇక మన కాళ్ళు చేతిలు మన కంట్రోల్ లో ఉండవు. వాటంతట అవే కదల డం లాంటివి చేస్తూ ఉంటాయి. ఏకంగా నాలుక కూడా అదుపులో ఉండకుండా పోతుందట. ఈ క్రమంలోనే ఇక కొరియా వ్యాధి బారిన పడిన వారు ఆహారం తీసుకోవడం ఎంతో ఇబ్బందికరంగా మారుతుందట.


 అయితే చాలా కొద్దిమందిలో మాత్రమే ఈ వ్యాధి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. యూపిఎస్ 13 ఏ అనే జీన్ మ్యుటేషన్ చెందడం వల్ల అరుదైన వ్యాధి బారిన పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల కర్నూలు జిల్లాకు చెందిన ఒక మహిళ ఈ వ్యాధి బారిన పడింది. అయితే మొదట్లో మహిళా చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెట్టింది.  ప్రమేయం లేకుండానే చేతులు కాళ్లు కదలడంతో దయ్యం పట్టింది అని అనుకున్నారు అందరు. ఈ క్రమంలోనే ఎంతోమంది భూత వైద్యుల దగ్గరికి కూడా తీసుకెళ్లారు. చివరికి ఇక డాక్టర్లను సంప్రదించగా డాక్టర్ల సూచన మేరకు నెలరోజుల పాటు చికిత్స తీసుకున్న సదరు మహిళ కొరియా వ్యాది నుంచి కోలుకుంది. సకాలంలో వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే కోలుకునే అవకాశం ఉంది అని అంటున్నారు డాక్టర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: