ఇతర దేశాల పై ఆధిపత్యం సాధించేందుకు ఎప్పుడూ ఎన్నో రకాల కుట్రలు చేస్తూ ఉంటుంది చైనా. ఇలా చైనా చేస్తున్న కుట్రలు ప్రపంచ దేశాలను చైనాకు శత్రువు గా మార్చేస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఇప్పటికే సరిహద్దుల్లో భారత్ ఆస్ట్రేలియా జపాన్ లాంటి దేశాలతో వివాదం పెట్టుకుంది చైనా. ఇలాంటి నేపథ్యంలో ఇక ఈ నాలుగు దేశాలు ఒక్కతాటిపైకి వచ్చి చైనా పై పోరాటం చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే జపాన్ ఆస్ట్రేలియా అమెరికా భారత దేశాలు క్వాడ్ కూటమిగా ఏర్పడ్డాయి అనే విషయం తెలిసిందే. ఇక ఈ క్వాడ్ కూటమిలోని దేశాలు  చైనా ఆటలు కట్టించేందుకు ఒకరికి ఒకరు సహాయ సహకారాలు చేసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి.


 ఈ క్రమంలోనే గతంలో ఆస్ట్రేలియా చైనాకు పంపించిన బొగ్గు నిల్వల పై నిషేధం విధించింది. చైనాకు ఎగుమతి చేయబోము అంటూ తెలిపింది. అయితే ఆస్ట్రేలియా నుంచి దిగుమతి అయ్యే బొగ్గు నిల్వల తోనే కరెంటు ఉత్పత్తి చేయడం పై ఎక్కువగా ఆధారపడుతుంది చైనా. ఇక ఆస్ట్రేలియా బొగ్గు నిలువల ఎగుమతి నిషేధం విధించడంతో ఒక్కసారిగా చైనాలో విద్యుత్ ఉత్పత్తి తగ్గి కరెంట్ సంక్షోభం వచ్చిన పరిస్థితి ఏర్పడింది. కరెంటు సంక్షోభం  కారణంగా చైనా అల్లాడిపోయింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అటు చైనా ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చేందుకు సిద్దమయింది అనేది తెలుస్తుంది. ఈ క్రమంలోనే చైనా ఆడిన సిల్లీ గేమ్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 ఇప్పటికే ఆస్ట్రేలియాను తన దారిలోకి తెచ్చుకునేందుకు చైనా ఎన్నో రకాల ప్రయత్నాలు చేసింది. అటు ఆస్ట్రేలియా మాత్రం లొంగకపోవడంతో  ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చేందుకు చైనా ఒక సిల్లీ గేమ్ స్టార్ట్ చేసింది అనేది తెలుస్తుంది  ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడుతుంటే చైనాలో మాత్రం నియంతృత్వ ధోరణితో వీ చాట్ అనే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వాడుతుంది. అయితే ఈ  వి చాట్ లో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి తో పాటుగా మంచి వర్గం మొత్తం అకౌంట్స్ కలిగి ఉన్నారు. కాగా ఇటీవల ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ అకౌంట్స్ అన్నింటికీ వి చాట్ నుంచి రిమూవ్ చేయడం సంచలనం గా మారిపోయింది. ఇక ఇదంతా చైనా వెనకుండి నడిపిస్తున్న సిల్లీ గేమ్ అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: