ఆఫ్ఘనిస్తాన్లో ఆయుధాలు చేపట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాళిబన్ల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న విధంగా మారిపోయింది. అధికారాన్ని చేపట్టిన తర్వాత ఇక తమ ఇష్టానుసారంగా పాలన సాధించవచ్చు అని అనుకున్నారు తాలిబన్లు. ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ఆయుధాలతో ఆధిపత్యాన్ని చేపట్టిన తాలిబన్లు ఇటీవలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇస్లామిక్ చట్టాలను కూడా అమలులోకి తీసుకు వస్తూ ఉండటం గమనార్హం.



 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఎప్పుడైతే ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ లు ఆధిపత్యాన్ని చేపట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో అప్పటినుంచి ఆఫ్ఘనిస్తాన్లో ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టింది. ఇక ఆఫ్ఘనిస్తాన్ తో ఉన్న అన్ని రకాల సంబంధాలను తెంచుకున్నాయ్ ప్రపంచ దేశాలు. దీంతో తాలిబన్లు ఒకవైపు ప్రపంచంతో సంబంధం లేకుండా పాలన సాగించలేక మరోవైపు ప్రపంచ దేశాలు ఎంతగానో విజ్ఞప్తి చేసినా సంబంధం పెట్టుకోవడంతో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారిపోయింది పరిస్థితి. అయితే తమ ప్రభుత్వాన్ని గుర్తించాలి అంటూ ఇప్పటికే ప్రపంచ దేశాలకు తాలిబన్లు విజ్ఞప్తి చేశారు అన్న విషయం తెలిసిందే.



 అయినప్పటికీ అటు ప్రపంచ దేశాలు మాత్రం తాలిబన్ల ప్రభుత్వం గుర్తించటం విషయం లో ఎక్కడ సానుకూలం గా స్పందించడం లేదు అన్నది తెలుస్తుంది. అయితే అటు అంతర్జాతీయ సమాజం తాలిబన్ల   ప్రభుత్వాన్ని గుర్తించక పోవడం కి కారణాలు కూడా లేకపోలేదు. గతం లో మయన్మార్లో సైనిక పాలనలో వచ్చిన సమయం లో ప్రజలు కూడా సైన్యం పాలనా ఆమోదించారు. ఈ క్రమంలోనే సైన్యం పాలనను కూడాప్రపంచ దేశాలు గుర్తించాయ్.  కానీ ఇప్పుడు ఆప్ఘనిస్తాన్లో మాత్రం ప్రజలు తాలిబన్ల  ప్రభుత్వాన్ని అంగీకరించే పరిస్థితి లేదు.  అందుకే తాళిబన్ల ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలకు గుర్తించేందుకు ఎక్కడ ముందుకు రావడం లేదని తెలుస్తుంది. కానీ తమ ప్రభుత్వాన్ని గుర్తించాలంటూ తాలిబన్లు మాత్రం వరుసగావిజ్ఞప్తి చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: