సోము వీర్రాజు యాక్షన్‌లో దిగేశారు. అసలు రాష్ట్రంలో సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతున్నారు. జగన్ ప్రభుత్వంపై పోరాటాలు చేస్తున్నారు. అదేంటి ఇంతవరకు సైలెంట్‌గా ఉంటూ, జగన్‌కు అనుకూలంగా పని చేస్తున్నారనే విమర్శలు తెచ్చుకున్న సోము...జగన్ ప్రభుత్వంపై పోరాటం చేయడం ఏంటని అందరికీ డౌట్ రావొచ్చు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది...ఎప్పుడైతే అమిత్ షా తిరుపతికి వచ్చి ఏపీ బీజేపీ నేతలకు క్లాస్ పీకారో, అప్పటినుంచి అధ్యక్షుడుగా ఉన్న సోములో బాగా మార్పు వచ్చింది.

అసలు అంతకముందు సోము ఎలా ఉండేవారో అందరికీ తెలిసిందే. ఏదో ఇప్పుడు కూడా సీఎంగా చంద్రబాబు ఉన్నట్లు, ఆయనపైనే విమర్శలు చేసేవారు. పాపం జగన్‌ని ఒక్క మాట కూడా అనేవారు కాదు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా, అప్పటిలో చంద్రబాబు ప్రభుత్వంలో ఇలాగే జరిగిందని విమర్శించేవారు తప్ప, జగన్‌ ప్రభుత్వాన్ని విమర్శించేవారు కాదు. అందుకే సోము జగన్ మనిషి అని టీడీపీ శ్రేణులు విమర్శలు చేసేవి.

అలా విమర్శలు తెచ్చుకున్న సోము ఒక దెబ్బతో మారిపోయారు. ఎప్పుడైతే అమిత్ షా క్లాస్ ఇచ్చారో, అప్పటినుంచి ఎక్కడకు పడితే అక్కడకు వెళ్లిపోతున్నారు. తాజాగా ఉద్యోగుల మద్ధతుగా పోరాటం మొదలుపెట్టారు. అలాగే గుడివాడలో మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేసి, క్యాసినో వ్యవహారంపై ఫైర్ అయిపోయారు. అసలు తాజాగా గుడివాడ వెళ్ళి సోము హల్చల్ చేసేశారు. అయితే సోము చేసేది ప్రజల్లోకి వెళుతుందా? అంటే ప్రజల్లోకి వెళ్ళడం దేవుడెరుగు ముందు...కేంద్రం పెద్దల దృష్టికి వెళితే చాలు అన్నట్లుగా సోము పర్ఫామెన్స్ ఉందని విమర్శలు వస్తున్నాయి.

ఇప్పటికే ఆయన అధ్యక్ష పదవి పోయేలా ఉందని కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన.. తన పర్ఫామెన్స్ ఏంటో చూపించడానికే ఈ హడావిడి చేస్తున్నారని అంటున్నారు. దూకుడులో ఎవరెంత పర్ఫామెన్స్ చేసిన నాగార్జున గారు...ప్రైజ్ మనీ తనకే ఇస్తారని బ్రహ్మానందం ఎలా ఆశ పెట్టుకుంటారో అలాగే..అధ్యక్ష పదవి నుంచి తనని తొలగించకూడదని చెప్పి...సోము పర్ఫామెన్స్ ఇరగదీస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp