అవును రేవంత్ రెడ్డి లీడ్‌లోకి వచ్చారు..అయితే పి‌సి‌సి అధ్యక్షుడుగా కాదు...కొడంగల్ నేతగా లీడ్‌లోకి వచ్చారు. ఎలాగో పి‌సిసి అధ్యక్షుడుగా రేవంత్, కాంగ్రెస్ పార్టీని రేసులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సీనియర్ నేతల రాజకీయం..అటు టీఆర్ఎస్-బీజేపీలు చేస్తున్న రాజకీయం మధ్యలో రేవంత్ రెడ్డి పికప్ అవ్వలేకపోతున్నారు...కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకు రాలేకపోతున్నారు. అయితే ఎలాగోలా పార్టీని నిలబెట్టడానికి కష్టపడుతున్నారు.

ఇదే క్రమంలో తన నియోజకవర్గంలో నిలబడాలని రేవంత్ గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఓడిన చోటే మళ్ళీ గెలవాలని చూస్తున్నారు. వరుసగా కొడంగల్‌లో రెండుసార్లు గెలిచిన రేవంత్..2018 ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ చేతుల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఓడిపోయారని అనడం కంటే...ఓడించారు అని చెప్పొచ్చు. అనేక రకాల వ్యూహాలు వేసి మరీ కొడంగల్‌లో రేవంత్‌ని ఓడించారు. టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు...కొడంగల్‌పై ప్రత్యేకమైన దృష్టి పెట్టడం...టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలో దిగిన పట్నం నరేందర్ రెడ్డి..ఆర్ధికంగా కొడంగల్‌లో గట్టిగా ఖర్చు చేయడంతో...రేవంత్‌ ఓడిపోయారని కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికీ ఆరోపిస్తుంటాయి.

అలా రేవంత్‌పై గెలిచిన నరేందర్...ఇప్పుడు కొడంగల్‌లో వీక్ అవుతున్నారు...ఎమ్మెల్యేగా ఉండి కూడా కొడంగల్‌కు ఆయన చేసేది ఏమి లేదు..పైగా ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అనుచరుల అక్రమాలు, దందాలు పెరిగిపోయాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొడంగల్‌లో రేవంత్‌కు రూట్ క్లియర్ అయింది. ఇప్పటికే ఆయన కొడంగల్ బరిలో ఉంటానని చెప్పిన విషయం తెలిసిందే.

తాజాగా కొడంగల్‌లో 75 వేల కాంగ్రెస్ సభ్యత్వాలు అయ్యాయి..అంటే ఒక నియోజకవర్గంలో ఇన్ని సభ్యత్వాలు అంటే మాటలు కాదు..అసలు గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి పడిన ఓట్లు 71 వేలు...ఇప్పుడు 75 వేల సభ్యత్వాలు అంటే...కొడంగల్‌లో రేవంత్‌కు ఎంత అనుకూల వాతావరణం కనబడుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సారి ప్రజలు కూడా రేవంత్ వైపే మొగ్గు చూపేలా ఉన్నారు..మళ్ళీ టీఆర్ఎస్ నుంచి పట్నం నరేందర్ నిలబడితే ప్రజలు కొడంగల్ ప్రజలు ఓడించేలా ఉన్నారు. ఏదేమైనా కొడంగల్‌లో రేవంత్‌కు లీడ్ వచ్చిందనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: