
ఇక దీనిపై బండి కూడా తీవ్రంగానే స్పందిస్తూ..కేంద్ర హోమ్ శాఖకు ఫిర్యాదు చేయడం, పార్లమెంట్ ప్రివిలైజ్ కమిటీకి ఫిర్యాదు చేయడం, రాష్ట్రంలోని పోలీసు, ఇతర అధికారులకు కేంద్రం నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఇలా బండి విషయంలో ఏదో చేద్దామనుకుంటే..అది టీఆర్ఎస్కు రివర్స్ అయింది. ఇప్పుడు నిజామాబాద్ ఎంపీ అరవింద్‌ని టీఆర్ఎస్ టార్గెట్ చేసింది. అరవింద్ సైతం...కేసీఆర్‌పై తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. విమర్శలే కాదు...పరుష పదజాలంతో విరుచుకుపడుతున్నారు.
దీంతో అరవింద్‌పై కూడా రివెంజ్ తీర్చుకోవాలని అన్నట్లు టీఆర్ఎస్ ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. పైగా కవితని ఓడించారనే పగ కూడా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఆర్మూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొవడం కోసం వెళ్ళిన అరవింద్‌పై టీఆర్ఎస్ శ్రేణులు రాళ్ళ దాడి చేశాయి. ఇటు బీజేపీ శ్రేణులు కూడా తీవ్రంగా ప్రతిఘటించడంతో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది.
అయితే పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చి మాట తప్పడం వల్లే పసుపు రైతులు అరవింద్‌పై తిరబడ్డారని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. వారు పసుపు రైతులు కాదని గులాబీ గూండాలు అని కమలదళం ఆరోపిస్తుంది. ఇక తనపై దాడి విషయంలో కేంద్ర హోమ్ శాఖకు ఫిర్యాదు చేస్తానని అరవింద్ అంటున్నారు. ఇక కేంద్రం జోక్యం చేసుకుంటే టీఆర్ఎస్ పని రివర్స్ అవుతుంది.
పైగా అరవింద్‌ని అనవసరంగా రెచ్చగొట్టినట్లు ఉంది..అది కూడా ఆయన నెక్స్ట్ ఆర్మూర్ అసెంబ్లీలో పోటీ చేస్తారనే ప్రచారం ఉంది...అదే నియోజకవర్గంలో ఆయనని అడ్డుకున్నారు. ఇప్పుడు అదే నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని 50 వేల ఓట్ల మెజారిటీతో ఓడిస్తానని అరవింద్ సవాల్ చేశారు. పైగా గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆర్మూర్‌లో అరవింద్‌కు ఎక్కువ మెజారిటీ వచ్చింది. ఇప్పుడు అదే స్థానంపై అరవింద్ ఫోకస్ పెట్టారు. అంటే అరవింద్‌పై రివెంజ్ ప్లాన్ చేసి...అనవసరంగా కారు రివర్స్‌లో షాక్ తినేలా ఉంది.