ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అనే సుప‌రిచిత కాపు నాయ‌కులు ఇవాళ స్పందించారు. జిల్లాల‌కు సంబంధించి కొత్తగా పెట్ట‌బోయే పేర్ల‌కు సంబంధించి కొత్తగా ఏర్పాట‌య్యే జిల్లాల గురించి ఆయ‌న ఓ లేఖ ద్వారా జ‌గ‌న్ కు కొన్ని విలువైన సూచ‌న‌లు చేశారు.వాటి ఆధారంగా చూసుకున్నా జ‌గ‌న్ కాస్త ఆలోచిస్తే మంచి పేర్లు కొత్త‌జిల్లాల‌కు పెట్టిన వారు అవుతారు. రాయ‌ల ఏలుబ‌డి ద‌గ్గ‌ర నుంచి జీఎంసీ బాల‌యోగి వ‌ర‌కూ అంతా స్మ‌రించుకోద‌గ్గ రీతిలో ఆయ‌న పేర్ల సూచ‌న బాగుంది.ఇదేస‌మ‌యంలో ముద్ర‌గ‌డ సూచ‌న కాక‌పోయినా ఉభ‌య గోదావ‌రి జిల్లాల నుంచి కొత్తగా ఏర్పాట‌య్యే జిల్లాకు కాట‌న్ దొర పేరు ఉంచాల‌న్నది కూడా సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టాపిక్ గా ఉంది.


కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇప్ప‌టికే ఓ ర‌గ‌డ నెల‌కొని ఉంది.దీనికి కొన‌సాగింపుగా ముద్ర గ‌డ జ‌త క‌లిశారు.త‌న గొంతుక వినిపించారు. కొత్తగా ఏర్పాట‌య్యే జిల్లాల‌కు సంబంధించి  ఇప్ప‌టికే పేర్ల విష‌య‌మై వివాదం ఉంది. ఆ వివాదాన్ని మ‌రింత పెంచేందుకు  ముద్ర‌గ‌డ‌సీన్ లోకి వ‌చ్చారు.తాజాగా అమ‌లాపురం కేంద్రంగా ఏర్పాటు కానున్న కోన‌సీమ జిల్లాకు దివంగ‌త నేత బాల‌యోగి పేరు పెట్టాల‌ని సూచించారు. లోక్ స‌భ స్పీక‌ర్ గా బాల‌యోగి ఎన‌లేని ఖ్యాతి పొందారు. అదేవిధంగా అమ‌లాపురం తో స‌హా ప‌రిస‌ర ప్రాంతాల అభివృద్ధికి ఆయ‌న ఎంత‌గానో కృషి చేశారు. టీడీపీ నేత‌గా, ఢిల్లీలో కీల‌క నేత‌ల్లో ఒక‌రిగా చిర స్థాయిలో కీర్తిని అందుకున్నారు. అదేవిధంగా ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌లో కొత్తగా ఏర్పాట‌య్యే జిల్లాకు ఏదో ఒక‌దానికి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్క‌ర్ పేరు పెట్టాల‌ని కోరారు.





ఆ విధంగా ఆయ‌న సేవ‌ల‌ను చిర‌స్మ‌ర‌ణీయ స్థాయిలో గుర్తింపు ఇచ్చిన‌ట్లు అవుతుంది అన్న‌ది ఆయ‌న భావ‌న. బాబాసాహెబ్ అనే ఓ అనిత‌ర సాధ్యం అయిన వ్య‌క్తి ఈ దేశానికి అందించిన సేవ‌ల‌ను త‌ల్చుకోవ‌డ‌మే కాదు,వారి స్ఫూర్తి భావి త‌రాల‌కు అందించేందుకు కూడా ఇటువంటి ప్ర‌య‌త్నాలు ఎంత‌గానో స‌హ‌క‌రిస్తాయ‌న్న‌ది ఆయ‌న మ‌న‌సులోని మాట. వీటితో పాటు కొత్త ఏర్పాటు కానున్న జిల్లాలకు ఏదో ఒకటి ఎంచుకుని కృష్ణ దేవ‌రాయులు పేరును ఉంచాల‌ని కోరారు. తిరుప‌తి క్షేత్రం అభివృద్ధిలో కాని లేదా రాయ‌ల వారి ప్రాభ‌వంలో ఉన్న మ‌రికొన్ని ఆల‌యాల నిర్మాణంలో కానీ ఆ రోజు నుంచిఈ రోజు వ‌ర‌కూ రాయ‌ల‌వారి ముద్ర‌ను మ‌రువలేం.క‌నుక అది రాయ‌ల సీమ ర‌త‌నాల సీమ.రాయ‌ల ఏలుబ‌డిలో ఉన్న సీమ. క‌నుక ఏదో ఒక జిల్లాకు ఆయ‌న పేరు సూచిస్తే మంచిద‌న్న భావ‌న ముద్ర‌గ‌డ‌లో ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

ycp