క‌రోనా స‌మ‌యంలో సోనూసూద్ ఎంతో మంది పేద‌ల‌కు స‌హాయ‌, స‌హ‌కారాలు అందించారు. అప్ప‌టి నుంచి  ప్ర‌పంచ వ్యాప్తంగా సోనూసూద్ పేరు మారు మ్రోగిపోతుంది.  ఎంద‌రివో క‌ష్టాలు తీర్చి రియ‌ల్ హీరో అనిపించుకున్న సోనూసూద్‌పై ఉన్న అభిమానంతో చాలా మంది అరుదైన గౌర‌వం కూడా ఇచ్చారు.  తెలంగాణ‌లోని ఖ‌మ్మం జిల్లా బోన‌క‌ల్ మండ‌లం  గార్ల‌పాడు గ్రామానికి చెందిన గుర్రం వెంక‌టేశ్వ‌ర్లు, మ‌రియ‌మ్మ దంప‌తులు కూలీ ప‌నులు చేసి కూడ‌గ‌ట్టుకున్న రూ.25వేలతో సోనూసూద్ విగ్ర‌హాన్ని విజ‌య‌వాడ‌లో త‌యారు చేయించి 2021 ద‌స‌రా సంద‌ర్భంగా ఆవిష్క‌రించారు.

క‌రోనా స‌మ‌యం నుంచి ప్ర‌తీ ఒక్క‌రికీ స‌హాయ స‌హ‌కారాలందిస్తూ ప్ర‌జ‌ల్లో దేవుడిగా పేరు సంపాదించుకున్న సోనూసూద్ కోసం ఎన్నో రాజ‌కీయ పార్టీలు ఆహ్వానం ప‌ల‌క‌డానికి సిద్ధం అయ్యాయి. తాను ఇప్పుడు రాజ‌కీయాల్లోకి రాను త‌న ల‌క్ష్యాలు నెర‌వేరిన త‌రువాత రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని..  మ‌రో ఐదేండ్ల త‌రువాత రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని  సోనూసోద్‌ ఇటీవ‌లే ప్ర‌క‌టించాడు. ముఖ్యంగా సోనూసూద్ చేసిన సాయంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తమ‌వుతోంది. మంచి ప‌నుల‌ను ఐక్య‌రాజ్య‌స‌మితి గుర్తించింది.

అవార్డుతో స‌త్క‌రించి  సోనూసూద్‌కు స‌రైన గౌర‌వం అంద‌జేసిన‌ది. సోష‌ల్ మీడియాలో త‌న‌కు ప్రాబ్లం వ‌చ్చిందంటే చాలు ఇప్ప‌టికీ సోనూసూద్ వెంట‌నే స్పందించి.. సాయం చేసి శెబాష్ అనిపించుకుంటాడు. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎంతో మంది వ‌ల‌స కూలీల‌కు అన్నంపెట్టి, స్వ‌స్థ‌లాల‌కు చేర్చిన ఘ‌న‌త సోనూసూద్‌కే ద‌క్కుతుంద‌ని చెప్పాలి. ఆర్థికంగా వెనుక‌బ‌డిన పేద‌లంద‌రికీ సాయం చేయ‌డం, అవ‌స‌ర‌మైన వారికి స‌ర్జ‌రీ కూడా చేయించారు.  సోనూసూద్ చేసిన సేవ‌ల‌కు ఐక్య‌రాజ్య‌స‌మితి గుర్తించి స్పెష‌ల్ హ్యుమ‌నిటేరియ‌న్ అవార్డుతో స‌త్కారం చేసింది.

యునైటేడ్ నేష‌న్స్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగ‌మైన సస్టెయిన‌బుల్ డెవ‌ల‌ప్‌మెంట్ గోల్స్ కార్య‌చ‌ర‌ణ‌లో ఈ అవార్డు  అంద‌జేశారు.  ముఖ్యంగా  జ‌న‌వ‌రి 26,2022 గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా భార‌త ప్ర‌భుత్వం అన్ని రంగాల వారికి ప‌ద్మ అవార్డుల‌ను ప్ర‌క‌టించిన విష‌యం విధిత‌మే.  క‌రోనా స‌మ‌యంలో.. ప్ర‌స్తుతం,  నిత్యం  ఎల్ల‌వేళ‌లా సేవ చేసే సోనూసూద్ పేరు అవార్డుల జాబితాలో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. నిజానికి గ‌త ఏడాది సోనూసూద్‌ను ఎంపిక చేయ‌క‌పోవ‌డం ప‌ట్ల ఆయ‌న అభిమానులు ప‌లువురు కేంద్ర ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారు.

ఈ త‌రుణంలో కొంద‌రూ స్పందిస్తూ.. సోనూసూద్ ఢిల్లీ ప్ర‌భుత్వం ప్రారంభించిన‌  దేశ్ కా మెంట‌ర్ కార్య‌క్ర‌మానికి బ్రాండ్ అంబాసిట‌ర్‌గా వ్వ‌వ‌హ‌రిస్తున్నందుకే సోనూసూద్‌కు అవార్డుల జాబితాలో చోటు ద‌క్క‌లేదని సందేహాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. మ‌రికొంద‌రూ రాజ‌కీయ కుట్ర ఉంద‌ని.. అందుకే సోనూసూద్‌కు ప‌ద్మ అవార్డు ద‌క్క‌లేద‌ని పేర్కొంటున్నారు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని కేంద్ర ప్ర‌భుత్వం  128 మందికి ప‌ద్మ పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించిన‌ది.

మరింత సమాచారం తెలుసుకోండి: