ఎప్ప‌టి నుంచో దేశీయ యాప్స్ ను వాడుకోవాల‌ని విదేశీ యాప్స్ పై మోజు వ‌ద్ద‌ని అంటోంది కేంద్రం.నిఘా వ‌ర్గాలు కూడా ఆ రెండు యాప్స్ (వాట్సాప్, టెలిగ్రామ్) మంచివి కావ‌నే అంటుంది.ముఖ్యంగా డేటా చోరీ,త‌రువాత వాటి అమ్మ‌కం విరివిగా ఇటీవ‌ల కాలంలో జ‌రుగుతున్నాయి.భార‌త్ లో వీటి నిషేధం సాధ్యం కావ‌డం లేదు. యూజ‌ర్స్ ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల వీటిని వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రికి వారు నిషేధించి వాటి స్థానంలో దేశీయ యాప్స్ ను వాడుకునేలా చేయాల్సిన ప్ర‌చారం చేస్తున్నా కూడా ఫ‌లితం క‌నిపించ‌డం లేదు.మ‌రోవైపు డేటా ప్రైవ‌సీ పై కంపెనీలు ఇస్తున్న హామీల‌న్నీ గాలి మాట‌లే అవుతున్నాయి. నీటి రాత‌లే అవుతున్నాయి. ఈ ద‌శ‌లో కేంద్రం ఎట్ట‌కేల‌కు ఉద్యోగుల వ‌ర‌కూ కొన్ని కీల‌క నిర్ణ‌యాల‌ను మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసి  కాస్తో కూస్తో ఇంట‌ర్న‌ల్ సెక్యూరిటీ పై నిఘా ఉంచింది. త‌ద్వారా ఉద్యోగుల వాడకంపై నియంత్ర‌ణా ఉంచింది.


ప్రముఖ సామాజిక మాధ్య‌మాలు అయిన వాట్సాప్,టెలిగ్రామ్ పై మోడీ మార్కు నిషేధం పడింది. వాటిని విరివిగా వాడ‌కూడ‌ద‌ని, ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల‌కు సంబంధించి అస్స‌లు వాడ‌కూడ‌ద‌ని, డేటా ట్రాన్స‌ఫ‌ర్మేష‌న్ కు ఆ యాప్ ల‌ను వాడితే అవి మిస్ యూజ్ అయ్యే అవ‌కాశాలే మెండుగా ఉన్నాయ‌ని మోడీ అంటున్నారు. అందుకనే వాటిని వాడ‌కూడ‌ద‌ని చెబుతున్నారు. డేటా బ‌దిలీకి గ‌వ‌ర్న‌మెంట్ ఇచ్చి ఇ - గ‌వ‌ర్న‌మెంట్ అప్లికేష‌న్స్ ను మాత్ర‌మే వాడుకోవాల‌ని మోడీ ప‌దే ప‌దే సూచిస్తున్నారు.ఇప్ప‌టికే విదేశాల‌కు చెందిన  చాలా యాప్స్ కార‌ణంగా దేశంలో ఓ విధం అయిన అభ‌ద్ర‌త నెల‌కొని ఉంది. క‌నుక దేశ అంత‌ర్గత భ‌ద్ర‌త త‌దిత‌ర కార‌ణాల దృష్ట్యా ఈ నిర్ణ‌యాలు వెలువ‌రించామ‌ని మోడీ అంటున్నారు.


అదేవిధంగా ఇంకొన్ని కీలక నిర్ణ‌యాలు కూడా ఆయ‌న వెలువ‌రించారు.ముఖ్యంగా ఆన్లైన్ మీటింగ్ ల‌కు సంబంధించి చాలా మంది ప్ర‌భుత్వాధికారులు జూమ్ ను కానీ గూగుల్ మీట్ ను కానీ ఆశ్ర‌యిస్తున్నారు. ఇవి కూడా శ్రేయోదాయ‌కం కాద‌ని అంటున్నారు మోడీ. అందుకే వీటిపై కూడా తాము నిఘా ఉంచామ‌ని చెబుతున్నారు.విదేశాల‌కు సంబంధించిన యాప్స్ కు బ‌దులు ప్ర‌భుత్వం డెవ‌ల‌ప్ చేసిన యాప్స్ ను కానీ దేశీయ మార్కెట్ లో అందుబాటులో ఉన్న యాప్స్ ను కానీ వినియోగించుకోవాలి సూచిస్తోంది.వాట్సాప్పే కాదు టెలిగ్రామ్ ను కూడా విరివిగా వాడొద్ద‌నే అంటోంది కేంద్రం. వీటి స్థానంలో దేశీయ ప‌రిజ్ఞానంతో రూపొందింప‌ చేసిన, డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ - డాక్‌), నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐఎస్‌) త‌దిత‌ర ప్ర‌భుత్వ సంస్థ‌లు అభివృద్ధి చేసిన సాఫ్ట్ వేర్ ను ఉప‌యోగించుకుని దృశ్య సంబంధ భేటీలు (వీడియో మీట్ ) నిర్వ‌హించుకోవాల‌ని మోడీ విన్న‌వించారు.
మరింత సమాచారం తెలుసుకోండి: