మన బ్రతుకు బండి ముందుకు నడవాలంటే డబ్బులు అనే పెట్రోల్ ఉండాల్సిందే. అది లేదంటే క్షణమైనా ముందుకు గడవదు. అయితే ఈ కరెన్సీ నోటును మీరు బాగా గమనిస్తే అందులో మన జాతిపిత బాపూజీ మహాత్మ గాంధీ ఫోటో మాత్రం ఉంటుంది. ఆ కరెన్సీ నోటు పై స్వచ్ఛంగా నవ్వుతున్న గాంధీజీ గారి ఫోటో మనకు ఎన్నో నేర్పుతుంది. కరెన్సీ నోటుపై గాంధీ గారి బొమ్మ ఉండటం చూసి చాలా మంది అసలు గాంధీ తాత బొమ్మనే నోటుపై ఎందుకు ముద్రించారు అన్న అనుమానం వచ్చే ఉంటుంది. అసలు ఈ ఫోటో ఎందుకు వచ్చింది దీని వెనుక చరిత్ర ఏమిటి అంటే?

కరెన్సీ నోటుపై ఉండేది గాంధీజీ క్రాప్ చేసినది కాదు. అది నిజమైన ఫోటో ప్రింట్. మనకు స్వాతంత్య్రం రావడానికి సంవత్సర కాలం ముందు1946 వ సంవత్సరంలో ఒక గుర్తు తెలియని ఫోటోగ్రాఫర్ గాంధీ గారి బొమ్మని తన కెమెరా లో బంధించాడు. కోల్ కత్తా లోని వైస్రాయ్ భవంతి లో, అప్పట్లో బ్రిటీష్ సెక్రటరీ అయిన లార్డ్ ఫ్రెడ్రిక్ లారెన్స్ అనే వ్యక్తి తో మహాత్మా గాంధీ కలిసినప్పుడు తీసిన అందమైన మరియు సహజమైన ఫోటో అది. కానీ ఆ ఫోటో ను ఇలా కూడా వాడుకుంటారా అని అప్పట్లో ఏ మేధావి ఊహించి ఉండరు. ఫ్రెడ్రిక్ లారెన్స్  ఒక బ్రిటిష్ రాజకీయ నాయకుడు. బ్రిటన్ లో ఉన్న సమయంలో మహిళ శ్రేయస్సు కోసం పోరాడారు.

అలాగే భారత్ - బర్మా కి సెక్రటరీ గా కూడా పని చేశారు. అయితే అప్పట్లో గాంధీ గారు ఫ్రెడ్రిక్ గారిని కలిసినపుడు ఇలా ఆ ఫోటో క్లిక్ చేయబడింది. అందులో నుండి  గాంధీ గారి పిక్ ని మాత్రమే క్రాప్ చేసి నోటుపై అచ్చు వేయడం జరిగింది. గాంధీజీ గారి బొమ్మను ముద్రించినటువంటి కరెన్సీ నోట్లు 1996 వ సంవత్సరం నుండి అందుబాటులోకి వచ్చాయి. అంతక ముందు వరకు అశోక స్తంభాన్ని ముద్రించి వున్న కరెన్సీ నోట్లు చలామణిలో ఉండేవి.

మరింత సమాచారం తెలుసుకోండి: