నెల్లూరు జిల్లాలో పండే మొలగొలుకుల బియ్యానికి ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. ఇది దాదాపు ఆరు నెలల పైచిలుకు పంట. కాలగమనంలో ఎన్నో వరి వంగడాలు వచ్చినా ఈ జిల్లా రైతులు మొలగొలుకుల సాగు కే ఎక్కవగానే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ విధానాల మూలంగా నెల్లూరు మొలగొలుకులకు కాలం చెల్లందా ? అని అనిపిస్తోంది.

భారత ప్రధాన మంత్రి దామోదర్ దాస్ నరేంద్ర మోడీ 75వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో  దేశ ప్రజలందరికీ పోషకాహారాన్ని అందిస్తామని ప్రకటించారు.  2024 నాటికి రేషన్ షాపుల ద్వారా ఈ బియ్యం అందిస్తామని  ప్రకటించారు. దీంతో అందరి దృష్టి పోషకాహార బియ్యం ( ఫోర్టిఫైడ్ రైస్) పై పడింది. సామాన్యులు మొదలుకుని పారిశ్రామిక వేత్తలు, శాస్త్రవేత్తలు అందరూ కూడా నోసలు చిట్లించి పోషకాహార బియ్యం పై   ఆరా తీశారు.
 ఫోర్టిఫైడ్ రైస్ అచ్చం మనం వండుకుని తినే బియ్యంలాగే ఉంటుంది. ఇది పండించుకు తినే బియ్యం మాత్రం కాదు. ఫ్యాక్టరీలలో తయారయ్యే బియ్యం. ఆశ్చర్యపోకండి. అవును ఇది నిజం. రైతులు పండించిన వరి ధాన్యాన్ని సేకరించి, బియ్యంగా మార్చి అందలో పోషకాలు ఉండే రాగులు, సజ్జలు, జొన్నలు, గోధుమలు  తరితర పోషకాహార విలువలున్నగింజల పొడిని  కిలిపి బియ్యం తయారు చేస్తారు. ఈ బియ్యం అచ్చం ప్రస్తుతం మనం వండుకుని తనే బియ్యం తరహాలోనే ఉండటం గమనార్హం.
ఈ ఫోర్టిఫైడ్ రైస్ పరిశ్రమ దక్షిణ బారత దేశంలో తొలిసారిగా నెల్లూరు జిల్లా నాయుడు పేట ప్రత్యేక పారిశ్రామిక వాడలో ఏర్పాటు కానుంది. కేంద్ర ప్రభుత్వం ఆహార శుద్ధి పరిశ్రమ అయిన ఫోర్టిఫైడ్ పరిశ్రమకు ప్రోత్సాహాలు ఇస్తుండటంతో మహారాష్ట్ర లోని ఫెర్ మంటా బయోటెక్ కంపెనీ నెల్లూరు జిల్లాలో తన పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినట్లు అధికార వర్గాల సమాచారం. ఉత్తర భారత దేశంలో ఇప్పటికే ఇలాంటివి ఒకట్రెండు పరిశ్రమలు  ఉన్నాయి. దక్షిణ భారత దేశంలో ఇదే తొలి పరిశ్రమ. రోజుకు పాతిక మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ ను ఈ కర్మాగారం తయారు చేస్తుంది. ఇక్కడ తయారయ్యే పోషకాహార బియ్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.  బడి పిల్లల మధ్యాహ్న భోజనానికి, అంగన్ వాడీ సెంటర్లకు, చౌక ధరల దుకాణాల ద్వారా  ఈ బియ్యం పంపిణీ అవుతుంది. ఇక నెల్లూరు బియ్యం అంటే ఫోర్టిఫైడ్ రైస్ అనుకోవాలా ? మీరే చెప్పండి.


మరింత సమాచారం తెలుసుకోండి: