ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సేవా పోర్ట‌ర్ ద్వారా ప్ర‌జ‌ల‌కు అత్యంత వేగంగా పార‌ద‌ర్శ‌కంగా సేవ‌లందుతాయి. ప్ర‌జ‌లు త‌మ‌కు అవ‌స‌ర‌మైన స‌ర్టిఫికెట్లు, డాక్యుమెంట్ల కోసం ఇక‌పై కార్యాల‌యాల చుట్టు తిరిగే అవ‌కాశం లేకుండా చేశారు. కుల‌, మ‌త‌, రాజ‌కీయాల‌కు తావు లేకుండా పార‌ద‌ర్శ‌కంగా సేవ‌లను అందిస్తున్నాం అని ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి స్ప‌స్టం చేసారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో గురువారం సీఎం వైస్ జ‌గ‌న్ వ‌ర్చువ‌ల్‌గా ఏపీ సేవా పోర్ట‌ర్‌ను ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా సీఎం మీడియాతో ముచ్చ‌టించారు. అవినీతికి తావు లేని వ్య‌వ‌స్థ కోసం ఏపీ సేవా పోర్ట‌ల్‌ను రూపొందించాం అని ప్ర‌జ‌ల‌కు త‌మ‌కు అవ‌స‌ర‌మైన సేవ‌లు పొందేందుకు ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం ఉంటుంది. అంతేకాకుండా మ‌న ద‌ర‌ఖాస్తు ఎక్క‌డ ఉంటుందో ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు కూడా ఉండ‌నుంది. ఈ విధానం ద్వారా అధికారులు, ఉద్యోగుల మ‌ధ్య సమ‌న్వ‌యం ఉంటుంద‌ని సీఎం చెప్పారు.

ముఖ్యంగా సిటిజ‌న్ సర్వీస్ పోర్ట‌ల్ వంటి మంచి కార్య‌క్ర‌మానికి ప్ర‌భుత్వం శ్రీ‌కారం చుట్టింద‌ని వెల్ల‌డించారు జ‌గ‌న్‌. పోర్ట‌ల్‌ను ప్రారంభించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఈ పోర్ట‌ల్ ద్వారా మారుమూల  గ్రామంలో కూడా వేగంగా పార‌ద‌ర్శ‌కంగా జ‌వాబుదారిత‌నం పెంచే విధంగా మ‌న‌కు ఉన్న వ్య‌వ‌స్థ‌ను ఇంకా మెరుగు ప‌రిచి మెరుగైన వ్య‌వ‌స్థ‌ను తీసుకుని రావ‌చ్చు. గ్రామ స్వ‌రాజ్యం సాధ‌న‌నే ల‌క్ష్యంగా వైసీపీ ప్ర‌భుత్వం ప‌ని చేస్తున్న‌ద‌ని జ‌గ‌న్ వెల్ల‌డించారు. మ‌న క‌ళ్ల ఎదుటే మ‌న గ్రామంలోనే ఒక గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్థ ఉందని చెప్పారు.

గ్రామంలోనే 10 మంది ఉద్యోగులు కూర్చోవ‌డం ప్ర‌తి 50 ఇండ్ల‌కు ఒక వాలంటీర్‌. వీరు స‌చివాల‌యాల‌కు అనుసంధానం కావ‌డం, నిజంగా దాదాపుగా 540కి పైగా ప్ర‌భుత్వ ప‌థ‌కాలు కార్య‌క్ర‌మాలు ఈ స‌చివాల‌యాల ద్వారా సేవ‌లందిస్తున్నాం అని చెప్పారు. గ్రామ స్వ‌రాజ్యం అంటే ఇంత‌క‌న్న అర్థం ఏమీ ఉండ‌క‌పోవ‌చ్చు అని సీఎం వైఎస్ జ‌గ‌న్ తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: