దేశ వ్యాప్తంగా ఉన్న ప‌రిస్థితులు వేరు ఢిల్లీలో ప‌రిస్థితులు వేరు. ముందుగానే క‌రోనా విజృంభ‌ణ అధికంగా ఉన్న ప్రాంతం కావ‌డంతో అన్నింటిపైనా క‌ఠినమ‌యిన రీతిలోనే ఆంక్ష‌లు అమ‌లు అవుతున్నాయి.ఈ ద‌శ‌లో క‌రోనా క‌ట్టడికి ఢిల్లీ స‌ర్కారు తీసుకున్న చ‌ర్య‌లు సత్ఫ‌లితాలు ఇవ్వ‌డంతో పాటు క‌రోనా రిక‌వ‌రీ రేటు కూడా బాగుంది.దేశ వ్యాప్తంగా చూసుకున్నా క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య బాగానే ఉంది.93శాతానికి పైగా రిక‌వ‌రీ రేటు ఉండ‌డంతో ప్ర‌భుత్వాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.ఈ క్ర‌మంలోనే కొన్నింటికి ముఖ్యంగా షాపుల‌కు బార్ల‌కు థియేట‌ర్ల‌కు స‌డ‌లింపులు ఇవ్వాల‌ని యోచిస్తున్నాయి.ఇదే ద‌శ‌లో ఢిల్లీ స‌ర్కారు వారాంతపు వేళ విధించిన ఆంక్ష‌లు పూర్తిగా ఎత్తివేయాల‌ని,వీకెండ్ క‌ర్ఫ్యూ నుంచి స‌డ‌లింపు ఇవ్వాల‌ని భావించ‌డం నిజంగానే ఓ విధంగా శుభ‌ప‌రిణామ‌మే! ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో!

క‌రోనా ఉద్ధృతి నుంచి కాస్త మిన‌హాయింపు
ద‌క్కిన నేప‌థ్యంలో పాజిటివిటీ రేటు పెరిగిన
సంద‌ర్భంలో దేశ రాజ‌ధానిలో ప‌రిస్థితులు
కాస్త మెరుగుప‌డ‌నున్నాయి అనేందుకు
తాజా ఉదాహ‌ర‌ణే వీకెండ్ క‌ర్ఫ్యూ నుంచి
ఢిల్లీ వాసుల‌కు విముక్తి లేదా స‌డ‌లింపు


క‌రోనా వ్యాధి ఉద్ధృతి త‌గ్గుద‌ల నేప‌థ్యంలో ఢిల్లీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వీకెండ్ క‌ర్ఫ్యూ పై ఉన్న ఆంక్ష‌ల‌ను ఎత్తివేసింది.దీంతో వారాంత వేళ‌ల్లో రాజ‌ధానిలో ఉన్నవారికి కాస్త ఊర‌ట ల‌భించ‌నుంది.క‌రోనా కేసులు రోజురోజుకూ త‌గ్గుముఖం ప‌డుతున్నాయ‌ని, ఇంకొన్నిరోజులు ఆగితే పాజిటివిటీ రేటు కూడా అనూహ్యంగా త‌గ్గ‌నుంద‌న్న ఆశాభావాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వెల్ల‌డిస్తున్నారు.ఇదే స‌మ‌యంలో నైట్ క‌ర్ఫ్యూ ను మాత్రం స‌డ‌లించ‌లేదు. దానిని య‌థావిధిగానే ఉంచాల‌ని భావిస్తున్నారు.


థియేట‌ర్ల‌కు మాత్రం యాభై శాతం ఆక్యుపెన్సీతో న‌డుపుకోవ‌చ్చ‌ని కేజ్రీ స‌ర్కారు అనుమ‌తులు మంజూరు చేసింది.ఇదేవిధంగా రెస్టారెంట్ల‌కు కూడా అనుమ‌తి ఇవ్వ‌నుంది. పెళ్లిళ్ల విష‌య‌మై కూడా ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రెండు వంద‌ల మందిని మాత్ర‌మే అనుమ‌తించేలా చ‌ర్య‌లు తీసుకోనుంది. లేదా ఫంక్ష‌న్ హాల్ సామర్థ్యంను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని అందులో స‌గం మంది వ‌చ్చేలా అనుమ‌తించ‌నుంది. పాఠ‌శాల‌ల విష‌య‌మై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: