తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా కొనసాగుతోంది. సామాన్య జనాల నుంచి మొదలుకొని ఏ ఒక్కరిని వదలడం లేదు. ముఖ్యంగా తెరాసకు చెందిన మంత్రులు లీడర్లు దీని బారిన పడటం కలకలం రేపుతోంది. ఈరోజు తాజాగా మంత్రికి కరోణ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయినా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికీ కరోనా  పాజిటివ్గా నిర్ధారణ అయినది. గురువారం రోజున జరిగినటువంటి పరీక్షల్లో ఆయన కరోణ వచ్చినట్టు వెల్లడైంది. అయితే గత మూడు రోజుల నుంచి మంత్రి అభివృద్ధి కార్యక్రమాలతో బిజీగా ఉన్నారని, ఆ సమయంలో ఆయనను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

ఇటీవలే ముత్తిరెడ్డి కూడా కరోణ బారిన పడ్డారు. గతంలో రాష్ట్రంలోనే కరోనా సోకిన మొదటి ఎమ్మెల్యే గా ముత్తిరెడ్డి ఉన్నారు. ఆ సమయంలో ముత్తిరెడ్డి ఇంట్లో నలుగురికీ కరుణ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ముత్తిరెడ్డి భార్య, మరియు గన్మెన్, డ్రైవర్, వంటమనిషి వీరందరికీ కరోణ వచ్చింది. తెలంగాణ నాయకులను కరోనా తీవ్రంగా కలవరపరుస్తోంది. ఈ మధ్యనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోణ సోకింది. కొద్దిరోజుల కిందటే ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలినది.

ఇలా ఒకరి తర్వాత మరొకరు టిఆర్ఎస్ నాయకులు కరోణ బారిన  పడుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఇప్పటివరకు తెలంగాణ మొత్తంలో కేసుల సంఖ్య  7,47,156కాగా, మరణించిన వారి సంఖ్య 4070 చేరుకుంది. అలాగే రికార్డుల సంఖ్య కూడా 7,05,056 ఉండగా, దీని బారినుండి 2045 కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు కూడా 94% ఉంది. ఇకపోతే ఐసోలేషన్ లో  38024 మంది ఉన్నారని, కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని, మాస్కు శానిటైజర్ తప్పనిసరిగా యూజ్  చేయాలని  కరోణ నిబంధనలు పాటించాలని  ఆరోగ్యశాఖ ఒక  ఒక ప్రకటనలో తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: