సామాజిక మాధ్య‌మాల‌కు పార‌ద‌ర్శ‌క‌త ఉందా లేదా అన్న విష‌య‌మ‌యి ఎప్ప‌టి నుంచో చ‌ర్చ జ‌రుగుతోంది.ఇదే చ‌ర్చ‌కు కొన‌సాగింపుగా రాహుల్ గాంధీ కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేసి ప్ర‌స్తుతం కొత్త వాదం ఒక‌టి వినిపిస్తున్నారు. మోడీ ఒత్తిడి కార‌ణంగానే త‌న ట్విట‌ర్ అకౌంట్ కు ఫాలోవ‌ర్లు త‌క్కువ చేసి చూప‌డం వంటివి చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లో భాగంగా ఆయ‌నీవాళ కొత్త వివాద‌మే రేపారు.

విప‌క్షాల అకౌంట్ల‌పై బీజేపీ నిఘా పెట్ట‌డం
మానుక‌ని నియంత్రించ‌డం మొద‌లుపెట్టింద‌ని
ఓ ఆరోప‌ణ కాంగ్రెస్ నుంచి విన‌వ‌స్తోంది
అందులో భాగంగా రాహుల్ గాంధీ
ట్విట‌ర్ అకౌంట్ కు ఫాలోవ‌ర్ల‌ను త‌క్కువ‌గా చూపించేలా
సంబంధిత యాజ‌మాన్యంపై ఒత్తిడి పెంచింద‌న్న‌ది
మ‌రో ఆరోప‌ణ‌.....


బీజేపీకి రాహుల్ గాంధీకి మ‌ధ్య త‌గాదాలు అన్నీట్వీట‌ర్ కేంద్రంగా న‌డుస్తుండ‌డంతో ట్విట‌ర్ యాజ‌మాన్యంపై అధికారంలో ఉన్న రాజ‌కీయ శ‌క్తులు కొన్ని ఒత్తిడి తెస్తున్నాయ‌ని ఓ ఆరోప‌ణ ఒక‌టి వినిపిస్తున్నారు కాంగ్రెస్ యువ నాయ‌కులు. దీంతో త‌మ బాస్ ట్విట‌ర్ అకౌంట్ కు ఫాలోవ‌ర్ల‌ను త‌గ్గించి చూప‌డం కూడా ఓ కుట్ర‌లో భాగంగానే ప‌రిగ‌ణిస్తున్నామ‌ని అంటున్నారు. ఇదే వాద‌న రాహుల్ గాంధీ కూడా వినిపిస్తున్నారు.


ప్ర‌జాస్వామ్యానికి, అధికారానికి మ‌ధ్య జ‌రిగే యుద్ధంలో సామాజిక మాధ్య‌మాల వినియోగం అన్న‌ది ఎంతో ప్రాధాన్యంతో కూడి ఉన్న‌ది అని రాహుల్ ఓ వ్యాఖ్య చేశారు.తాము చెప్పాల‌నుకుంటున్న మాట‌ల‌కు సామాజిక మాధ్య‌మాలే చ‌క్క‌ని వేదిక‌లు అని భావిస్తున్నామ‌ని అంటున్నారీయ‌న. కానీ ఇటీవ‌ల కేంద్రం ఏక‌ప‌క్ష ధోర‌ణితో త‌న అకౌంట్ పై నియంత్ర‌ణ చేప‌డుతున్న‌ద‌ని, అందుకే 2021 ఆగ‌స్టు నుంచి త‌న‌కు ఫాలోవ‌ర్లు త‌గ్గిపోయార‌ని అంటున్నారీయ‌న.


ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ సామాజిక మాధ్య‌మం ట్విట‌ర్ తో కొత్త త‌గాదా ఒక‌టి పెట్టుకున్నారు యువ రాజు రాహుల్. త‌న అకౌంట్ కు కావాల‌నే ఫాలోవర్ల సంఖ్య త‌క్కువ చేసి చూపిస్తున్నార‌ని ఆవేద‌న చెందుతూ ట్విట‌ర్ సీఈఓ ప‌రాగ్ అగ‌ర్వాల్ కు లేఖ రాయ‌డంతో ఇప్పుడీ వార్త సంచ‌ల‌నం అయింది.ట్వీట‌ర్ సీఈఓ కూడా ఘాటుగానే స్పందించింది.అటువంటి ప‌నుల‌కు తాము ప్రాధాన్యం ఇవ్వ‌బోమ‌ని, పార‌ద‌ర్శ‌త‌కే విలువ ఇస్తామ‌ని ట్విట‌ర్ యాజ‌మాన్యం జ‌వాబు ఇచ్చింది.అయితే ఇక్క‌డితే ఈ వివాదం అయిపోయింద‌ని అనుకునేందుకు వీల్లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: