జన గణన పూర్తి కాకుండా జిల్లాల విభజన చేయకూడదని కేంద్రం...రాష్ట్రాలని ఎప్పుడో ఆదేశించింది...అయినా సరే జగన్ ప్రభుత్వం జిల్లాల విభజన చేసింది. విభజన అయితే చేసింది గాని...కేంద్రం ఆదేశాలు వచ్చే వరకు...ఈ ప్రక్రియ పూర్తి కాదు...మరి ఇలాంటి తరుణంలో జగన్ ప్రభుత్వం జిల్లాల విభజన తీసుకురావడం అనేది రాజకీయమే అనే చర్చ నడుస్తోంది. ప్రజలంతా జిల్లాల గురించే చర్చించుకుంటారు...ఇతర సమస్యలు వదిలేస్తారనే కోణంలో జగన్ ప్రభుత్వం ఈ ప్రక్రియ తెరపైకి తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. సరే ఎలా తెచ్చినా సరే ఇప్పుడు ఈ జిల్లాల విభజన బాగా హాట్ టాపిక్ అయిపోయింది..జనమంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు.

అంతా ఇదే చర్చ చేస్తుంటే టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం...ఇంకా విభజనపై పూర్తి స్థాయిలో స్పందించ లేదు. కాకపోతే టీడీపీ నేతలతో వీడియో కాన్ఫిరెన్స్ పెట్టుకుని, జిల్లాల విభజనపై మాట్లాడారు. ఇదంతా సమస్యలని డైవర్ట్ చేయడానికే చేస్తున్నారని బాబు అన్నారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా పేరు పెడితే తాము ఎందుకు వ్యతిరేకిస్తామని, కానీ ఎన్టీఆర్ విగ్రహాలని ధ్వంసం చేసిన వారే..ఏదో ఎన్టీఆర్‌పై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని, ఎన్టీఆర్ జిల్లా కాదని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.


అయితే జగనే రాజకీయంగా ఇలాంటి ప్రక్రియతో ముందుకొస్తే...ఇంకా చంద్రబాబు దీనికి రాజకీయంగా ఎలా చెక్ పెట్టాలనే కోణంలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్రంగా తెలుసుకుని, వీటిల్లో ఉన్న లోటుపాట్లని తెలుసుకుని అప్పుడు ముందుకు రావాలని బాబు చూస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాల విభజన తెచ్చి..రాష్ట్రంలోని ఇతర సమస్యలన్నీ పూర్తిగా పక్కకు వెళ్లిపోయేలా చేసిన జగన్‌కు...అదే జిల్లాల రాజకీయంతో చెక్ పెట్టడానికి బాబు కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ జిల్లాల విభజనతో జనం పూర్తిగా సంతృప్తిగా లేరు. చాలా చోట్ల దీనిపై రచ్చ నడుస్తోంది. తమని పాత జిల్లాలో కలపాలని కొందరు..లేదు లేదు తమని కొత్త జిల్లాలో కలపాలని చెప్పి పలుచోట్ల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

పార్టీ, ఈ పార్టీ అని లేదు అన్నీ పార్టీల నేతలు సైతం ఈ జిల్లాలపై తమ డిమాండ్లని బయటపెడుతున్నారు. ఇక వాటిని ఆసరా చేసుకుని జగన్‌ని ఎక్కడకక్కడ ఇరుకున పెట్టాలనే వ్యూహంతో ముందుకొచ్చేందుకు బాబు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రాజధానుల అంశంపై జగన్‌ని ఇరుకున పెట్టడానికి చూశారు..ఇప్పుడు జిల్లాల విభజన విషయంలో జగన్‌కు చెక్ పెట్టడానికి బాబు రెడీ అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: