ఇప్పుడుప్పుడే ఏపీలో టీడీపీ బలపడుతున్న విషయం తెలిసిందే....గత ఎన్నికల్లో ఘోర పరాభవం నుంచి టీడీపీ చాలావరకు బయటపడింది...పైగా అధికార వైసీపీపై నిదానంగా పెరుగుతూ వస్తుంది...ఇందులో ఎలాంటి డౌట్ లేదనే చెప్పాలి. పైగా జగన్ ప్రభుత్వం తీసుకునే సంచలన నిర్ణయాలు...ప్రభుత్వానికి పెద్దగా నచ్చడం లేదు..దీంతో ప్రజలు కాస్త టీడీపీ వైపు తిరుగుతున్నారు. ఇలాంటి క్రమంలో ఉత్తరాంధ్రలో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది.


ఉత్తరాంధ్ర టీడీపీలో కీలకంగా ఉన్న శోభా హైమావతి, డీవీజీ శంకరరావులు...వైసీపీలో చేరారు. తాజాగా జగన్ సమక్షంలో ఈ ఇద్దరు నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే ఈ ఇద్దరు నేతలు టీడీపీని ఎప్పుడో వీడారు. శోభా హైమావతి తనయురాలు స్వాతిరాణి వైసీపీలో కీలకంగా పనిచేస్తున్నారు. ఈ తరుణంలో హైమావతి కూడా టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చారు.


అయితే అనేక ఏళ్ల నుంచి హైమావతి టీడీపీలో పనిచేస్తూ వస్తున్నారు...అలాగే శృంగవరపుకోట ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. కానీ గత రెండు ఎన్నికల నుంచి ఆమెకు టీడీపీలో టిక్కెట్ రావడం లేదు. ఎస్ కోటలో కోళ్ళ లలిత కుమారి టీడీపీ బాధ్యతలు చూసుకుంటున్నారు. 2014లో ఈమె ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతానికి ఎస్ కోట ఇంచార్జ్‌గా ఆమె పనిచేస్తున్నారు. దీంతో హైమావతికి ఇంకా టిక్కెట్ దక్కడం కష్టమని తేలిపోయింది. అలాగే ఆమెకు టీడీపీలో ప్రాధాన్యత కూడా తగ్గుతూ వస్తుంది..ఈ క్రమంలోనే ఆమె టీడీపీని వీడి వైసీపీలో చేరినట్లు తెలుస్తోంది.


అటు మాజీ ఎంపీ శంకరరావు సైతం టీడీపీని వీడి వైసీపీలో చేరారు..ఈయన గతంలో టీడీపీ తరుపున పార్వతీపురం ఎంపీగా పనిచేశారు. 1999 ఎన్నికల్లో ఈయన ఎంపీగా గెలిచారు. 2004లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచి ఈయనకు టీడీపీలో సీటు రాలేదు. ఇక సీటు కూడా వచ్చేలా లేదు..అందుకే ఆయన కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు. మరి ఈ ఇద్దరు నేతల టీడీపీని వీడటం వల్ల, ఆ పార్టీకి నష్టం పెద్దగా ఉండకపోవచ్చు.    

మరింత సమాచారం తెలుసుకోండి: