వైసీపీకి కలిసొచ్చే రాయలసీమ జిల్లాల్లో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి..ఇప్పటివరకు నాలుగు జిల్లాలుగా ఉన్న రాయలసీమ ఇప్పుడు 8 జిల్లాలుగా మారిపోయింది. తాజాగా జిల్లాల విభజనతో 8 జిల్లాలు వచ్చాయి...అయితే సీమలో ఉన్న 8 పార్లమెంట్ స్థానాలని బేస్ చేసుకుని ఈ జిల్లాలని ఏర్పాటు చేశారు. అయితే ఈ స్థానాలు పూర్తిగా వైసీపీ కంట్రోల్‌లో ఉన్నాయి...ఈ స్థానాల్లో ఆ పార్టీదే లీడింగ్. అలాగే ఆ పార్టీకి అనుకూలంగానే జిల్లాల విభజన కూడా చేసినట్లు కనిపిస్తోంది.

కాకపోతే ఇక్కడ కొన్ని ట్విస్ట్‌లు వచ్చాయి...ఒక పార్లమెంట్‌లో ఉండే అసెంబ్లీ స్థానాన్ని తీసుకొచ్చి పక్క జిల్లాల్లో కలిపేశారు. మొదటిగా చెప్పుకుంటే చిత్తూరు జిల్లా కాస్త రెండు జిల్లాలుగా మారిన విషయం తెలిసిందే. చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ స్థానాలు రెండు జిల్లాలు అయ్యాయి. చిత్తూరు అలాగే ఉండగా, తిరుపతి కాస్త బాలాజీ జిల్లాగా మారింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఉండే చంద్రగిరి అసెంబ్లీని బాలాజీ జిల్లాలోకి తీసుకొచ్చారు. అటు తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలోకి తీసుకొచ్చారు.

ఇటు అనంతపురం జిల్లా కాస్త అనంతపురం, సత్యసాయి జిల్లాలుగా ఏర్పడింది. సత్యసాయి జిల్లా అంటే హిందూపురం పార్లమెంట్ మొత్తం ఉంటుంది. ఇక హిందూపురం పార్లమెంట్‌లో ఉండే రాప్తాడుని తీసుకొచ్చి...అనంత జిల్లాలో కలిపేశారు. అటు కర్నూలు కూడా..కర్నూలు, నంద్యాల జిల్లాలుగా ఏర్పడింది. ఇక నంద్యాల పార్లమెంట్ పరిధిలో ఉండే పాణ్యం అసెంబ్లీ...కర్నూలు జిల్లాలోకి వచ్చింది.

ఇలా సీమలో ఊహించని మార్పులు చేశారు. అయితే సీఎం జగన్ సొంత జిల్లా కడప కూడా రెండు జిల్లాలు అయింది...వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాలుగా మారింది. అన్నమయ్య జిల్లా అంటే రాజంపేట పార్లమెంట్. కాకపోతే ఈ జిల్లాకు రాయచోటిని కేంద్రంగా పెట్టడాన్ని రాజంపేట ప్రజలు ఒప్పుకోవడం లేదు. మొత్తానికి ఇలా సీమలో అనేక ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి. మరి ఈ ట్విస్ట్‌లని ప్రజలు ఒప్పుకుంటారో లేదో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: