కోనసీమ అంటే మొన్నటివరకు ఒక ప్రాంతం పేరుగానే వినబడింది...కానీ ఇప్పుడు అదే ఇప్పుడు జిల్లాగా మారింది. ఏపీలో కొత్తగా కోనసీమ జిల్లా వచ్చింది. మొన్నటివరకు కోనసీమ అంటే ఒక బ్రాండ్‌గా ఉండేది...ఇప్పుడు ఆ బ్రాండ్ పేరు జిల్లా అయింది. తాజాగా జగన్ ప్రభుత్వం జిల్లాల విభజన చేసిన విషయం తెలిసిందే...13 జిల్లాలని పార్లమెంట్ స్థానాల వారీగా జిల్లాలుగా విభజించింది...అయితే మొత్తం 25 పార్లమెంట్ స్థానాలు ఉండటంతో...25 జిల్లాలు వచ్చాయి..కాకపోతే అరకు విస్తీర్ణంలో పెద్దదిగా ఉంటుంది కాబట్టి...దాన్ని రెండు జిల్లాలుగా చేశారు. దీంతో మొత్తం 26 జిల్లాలు వచ్చాయి.

ఇక రాష్ట్రంలో అతి పెద్ద జిల్లాగా ఉన్న తూర్పు గోదావరి మూడు జిల్లాలుగా విడిపోయింది. కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం పార్లమెంట్ స్థానాలు మూడు జిల్లాలు అయ్యాయి. కాకినాడ కేంద్రంగా తూర్పు గోదావరి జిల్లా అలాగే ఉంది. ఇక రాజమండ్రి కేంద్రంగా రాజమండ్రి జిల్లా వచ్చింది. ఇక అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా వచ్చింది. అంటే అమలాపురం పార్లమెంట్‌కు కోనసీమ జిల్లా అని పేరు పెట్టారు.

అయితే ఈ పేరుపై కొన్ని డిమాండ్లు కూడా వస్తున్నాయి...దీనికి బాలయోగి జిల్లా అని పేరు పెట్టాలని ముద్రగడ లాంటి వారు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ఈ జిల్లా పరిధిలోకి వచ్చిన మండపేట నియోజకవర్గం ప్రజలు...తమని రాజమండ్రిలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రి తమకు దగ్గరగా ఉంటుందని, కాబట్టి రాజమండ్రిలో కలపాలని మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు కోరుతున్నారు.

అయితే ఈ జిల్లాల విభజనతో రాజకీయంగా కూడా కొన్ని మార్పులు వచ్చేలా ఉన్నాయి. అందులో భాగంగా కోనసీమలో పవన్‌కు బాగా కలిసొచ్చేలా ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ జనసేనకు ఎక్కువ ఓట్లు పడ్డాయి..అలాగే రాజోలు సీటుని గెలుచుకుంది. ఇప్పుడు అక్కడ జనసేన మరింత బలం పుంజుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమలాపురం, కొత్తపేట, రాజోలు, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో జనసేన స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. మరి జిల్లా విభజనతో మరింత బలపడుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: