మాజీ మంత్రి నారాయణకు టెన్త్ పేపర్ లీకేజీ కేసులో బెయిల్ మంజూరైంది. ఆయనకు వ్యక్తిగత పూజీకత్తుతో బెయిలు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వులిచ్చారు న్యాయమూర్తి. మంగళవారం ఆయనను అరెస్ట్ చేసి చిత్తూరు తరలించారు అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ముందు ప్రవేశ  పెట్టారు. ఈ సందర్భంగా పోలీసులు చేసిన అభియోగాన్ని తోసిపుచ్చుతూ న్యాయమూర్తి బెయిలు మంజూరు చేశారు.

ట్విస్ట్ ఏంటంటే..?
నారాయణ బెయిలు విషయంలో అదిరిపోయే ట్విస్ట్ జరిగింది. అసలు నారాయణ విద్యాసంస్థల అధినేతగా ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఆయన తరపు న్యాయవాది.. నారాయణకు ఆ విద్యాసంస్థలకు సంబంధం లేదన్నట్టుగా వాదించారు. నారాయణ 2014లోనే విద్యాసంస్థల చైర్మన్ గా తప్పుకున్నారని చెప్పారు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆయన మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు.

2014లోనే నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్‌ పదవికి ఆయన రాజీనామా చేసినట్టు తెలిపారు ఆయన తరపు లాయర్లు. ఈమేరకు న్యాయమూర్తికి తగిన ఆధారాలు చూపించారు. దీంతో వారి వాదనలతో మేజిస్ట్రేట్ అంగీకరించి బెయిలు మంజూరు చేశారు. లక్ష రూపాయల చొప్పున ఇద్దరు జామీను ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.

నారాయణ అరెస్ట్ తర్వాత ఉదయం నుంచీ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నారాయణ అరెస్ట్ హైదరాబాద్ లో జరిగింది. ఆ తర్వాత ఆయన్ను ఏపీకి తెచ్చే క్రమంలో కొన్ని చోట్ల అడ్డంకులు ఎదురయ్యాయి. చివరకు పేపర్ లీకేజీపై కేసు నమోదైన చిత్తూరు జిల్లాకు ఆయన్ను తరలించారు. ఎస్పీ ప్రెస్ మీట్ లో అన్ని వివరాలు వెల్లడించారు. ఏప్రిల్‌ 27న చిత్తూరు జిల్లా నెల్లేపల్లిలోని జడ్పీహైస్కూల్ నుంచి టెన్త్ క్లాస్ తెలుగు క్వశ్చన్ పేపర్ లీకైంది. వాట్సప్ ద్వారా ఆ క్వశ్చన్ పేపర్ బయటకొచ్చింది. ఈ కేసులో నారాయణ పాత్ర ఉందని పోలీసు విచారణలో తేలింది. నారాయణ విద్యాసంస్థలకు చెందిన వ్యక్తి అప్రూవర్ గా మారడంతో సాక్ష్యం మరింత బలంగా ఉన్నట్టు పోలీసుుల నిర్థారించారు. ఆ తర్వాతే నారాయణను అరెస్ట్ చేశారు. అయితే ఆయన ఏ కారులో వెళ్తున్నారనే ఆచూకీ తెలియకుండా ఉండటానికి పలుమార్లు వాహనాలను మార్చారు పోలీసులు. రాత్రికి చిత్తూరు తరలించారు. చివరకు మేజిస్ట్రేట్ ముందు ప్రవేశ పెట్టగా ఆయనకు బెయిల్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: