యాధృచ్చికమో లేకపోతే ఇంకేమో తెలీదు కానీ ప్రపంచందేశాల్లోని ఇద్దరు అధినేతల పరిస్ధితి ఒకేసారి ప్రమాదంలో పడింది. రష్యా అధినేత వ్లాదిమర్ పుతిన్, చైనా అధినేత జిన్ పింగ్ ఇద్దరి ఆరోగ్యం ఒకేసారి విషమించినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. పుతిన్ కు ఎప్పటినుండో అనారోగ్యం ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. పుతిన్ పొత్తికడపు క్యాన్సర్ ప్లస్ పార్కిన్సన్స్ సమస్యతో బాగా ఇబ్బంది పడుతున్నారు. మొదట్లో దీన్ని రష్యా అధికార యంత్రాంగం కొట్టిపారేసింది.





అయితే ఇపుడు అనధికారికమే అయినా పుతిన్ ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో  డ్రాగన్ దేశం అధినేత జిన్ పింగ్ మెదడులో రక్తనాళాలు గడ్డకట్టేశాయట. దాంతో చైనా అధినేత కూడా అర్జంటుగా ఆపరేషన్ అవసరమని డాక్టర్లు తేల్చేశారు. అంటే ఇద్దరు అధినేతలకు ఏకకాలంలో కాస్త అటుఇటుగా పెద్ద ఆపరేషన్లే చేయాలన్న విషయం స్పష్టమవుతోంది. పుతిన్ కు తనకు జరగబోయే ఆపరేషన్ మీద అనుమానాలు వచ్చిందేమో.





అందుకనే ముందుజాగ్రత్తగా రష్యన్ సెక్యూరిటి కౌన్సిల్ సెక్రటరీ నికోలాయ్ పత్రుషేవ్ కు బాధ్యతలు అప్పగించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పత్రుషేవ్ తో పుతిన్ రెండుగంటలకు పైగా ఏకాంతంగా సమావేశమయ్యారట. దాంతో అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. క్యాన్సర్ ఆపరేషన్ విజయవంతమైనా అధినేత బాధ్యతలను పుతిన్ సమర్ధవంతంగా నిర్వహించలేరన్నది వాస్తవం.





ఇదే సమయంలో జిన్ పింగ్ మెదడు ఆపరేషన్ కూడా అత్యవసరమే. మెదడులో రక్తనాళాలు గడ్డకట్టడంతో పరిస్ధితి కాస్త ఆందోళనకరంగానే ఉందని పాశ్చాత్య మీడియా చెబుతోంది. రక్తనాళాల్లో రక్తంగడ్డకట్టి చిన్న చిన్న బ్లాకులుగా ఏర్పడ్డాయట. వీటిని అర్జంటుగా తొలగించకపోతే ప్రాణానికే ప్రమాదమని డాక్టర్లు హెచ్చరించారని మీడియా చెబుతోంది. బహుశా కోవిడ్ వ్యాక్సిన్ వికటించటంతోనే పరిస్దితి ఆందోళనకరంగా తయారైందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు కూడా తమ దేశాలకు జీవితకాలపు అధ్యక్షులుగా ఉండటానికి అవసరమైన అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఇపుడేమో ఇద్దరికీ ఏకకాలంలో ఆరోగ్యం విషమించటమే ఆశ్చర్యంగా ఉంది. రేపొద్దున వీళ్ళకు ఏమైనా అయితే ప్రపంచ రాజకీయాలే మారిపోతాయనటంలో ఎలాంటి సందేహాలు లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: