తన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో చంద్రబాబునాయుడు మొదటిసారిగా ఒక నిజాన్ని అంగీకరించారు. కుప్పం పర్యటనలో చంద్రబాబు అంగీకరించిన నిజమేమిటంటే తాను చేసిన తప్పువల్లే స్ధానికసంస్ధల ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందని. కుప్పం నుండి ఏడుసార్లు గెలిపించిన నేతలు, జనాలను తాను నిర్లక్ష్యం చేశానని బహిరంగంగా అంగీకరించారు. అందుకనే ‘తప్పుచేశా తలొంచుకుంటున్నా’ అని అన్నారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే 1989లో కుప్పం నుండి మొదటసారి గెలిచిన చంద్రబాబు నియోజకవర్గాన్ని చేయాల్సినంతగా డెవలప్ చేయలేదు. పైగా నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారనే చెప్పాలి. జనాలను పట్టించుకోలేదు, నేతలను, కార్యకర్తలను కూడా పట్టించుకోలేదు. చంద్రబాబు పేరుచెప్పి కొందరు నేతలు ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నా వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయలేదు. దాంతో చాలామంది నేతలు, కార్యకర్తలతో చంద్రబాబుకు గ్యాప్ వచ్చేసింది. ఇన్ని సంవత్సరాలు నమ్ముకున్న నేతలే చివరకు చంద్రబాబును ముంచారు. 

ఈ గ్యాప్ 2019 ఎన్నికల్లో స్పష్టంగా బయటపడింది. పోనీ తర్వాతైనా నియోజకవర్గంపైన దృష్టిపెట్టారా అంటే లేదు. నియోజకవర్గంలో పెత్తనాన్ని కొద్దిమంది నేతలకే వదిలేశారు. దాంతో మండిపోయిన ఇతర నేతలు, క్యాడర్ మొత్తం పార్టీని గాలికొదిలేశారు. దాంతో స్ధానికసంస్ధల ఎన్నికలు మొత్తాన్ని వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. 40 ఏళ్ళల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవటం ఇదే మొదటిసారి. స్ధానికసంస్ధల గెలుపుతో ఏకంగా అసెంబ్లీలో గెలుపుపై జగన్ టార్గెట్ చేశారు.

అప్పటినుండి చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే పరువుపోతుందని అర్ధమైంది. అందుకనే ఇప్పుడు అర్జంటుగా 2 ఎకరాలు కొని ఇల్లు కట్టుకుంటున్నారు. జూన్ 5వ తేదీ శంకుస్ధాపన చేయబోతున్నారు. ఇకనుండి అందరితోను టచ్ లో ఉంటానని, గతంలో చేసిన తప్పును చేయబోనని చెంపలేసుకున్నారు. మామూలుగా చంద్రబాబు నైజమేమిటంటే ప్లస్సయితే తన గొప్పతనంగాను, మైనస్ అయితే ఎదుటివాళ్ళమీద తోసేస్తుంటారు.  జరిగిన తప్పుకు పూర్తిబాధ్యతను చంద్రబాబు తీసుకోవటం ఇదే మొదటిసారి. మరీ జరిగిన తప్పును సరిదిద్దుకునేందుకు చంద్రబాబు ఏమాత్రం ప్రయత్నిస్తారో చూడాల్సిందే.  మరింత సమాచారం తెలుసుకోండి: