సాధారణంగా అత్తమామలు ఇంటికి కోడలిగా వచ్చిన యువతిని సూటిపోటి మాటలతో వేదిస్తూ ఉంటారూ. ఏదో ఒక విషయంలో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు అని చెబుతూ ఉంటారు. సీరియల్స్ ప్రభావమో లేక సినిమాల ప్రభావమో తెలియదు కానీ ఇక అత్త కోడల్ల బంధానికి మాత్రం గొడవలు అనే ఒక టాగ్ ఇచ్చేసారు అందరు. అత్తా కోడలు ఎప్పుడు ఒకరంటే ఒకరికి పడకుండా శత్రువు లాగానే ఉంటారు అంటూ అందరినీ నమ్మించారు. అయితే ఇలా ఎప్పుడు కోడలిని రాచి రంపాన పెట్టే  అత్తమామలు మాత్రమే కాదు కొడుకు ని పెళ్లి చేసుకుని ఇంటికి కోడలిగా వచ్చిన యువతిని కన్న కూతురిలా చూసుకునే అత్తమామలు కూడా ఉంటారా అంటే.. కేవలం సినిమాల్లో మాత్రమే ఇలాంటి అత్తమామలు ఉంటారని చెబుతూ ఉంటారు చాలా మంది జనాలు.


 నిజ జీవితంలో మాత్రం ఇలాంటి అత్తమామలు ఎక్కడా కనిపించరు అని బల్ల గుద్ది మరి చెబుతూ ఉంటారు.  కానీ ఇప్పటికీ కూడా కొంతమంది అత్తామామలు తమ కోడలిని కూతురులా భావించి పూర్తి బాధ్యతను స్వీకరించి సొంత తల్లిదండ్రుల్లా ప్రేమను చూపించే వారు చాలా మంది ఉన్నారు. సాధారణంగా  ఇక మెట్టినింటికి వచ్చిన కోడలు భర్త మరణించిన తర్వాత కూడా తమ ఇంట్లోనే ఉండాలని ఎక్కడికి వెళ్ళేందుకు వీల్లేదని రూల్స్ పెట్టే అత్తమామలను చూసి ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా కొడుకు చనిపోయాడు. కోడలు ఒంటరిగా ఉంటుంది అని చూసి వారి మనస్సు తరుక్కుపోయింది. దీంతో సొంత తల్లిదండ్రుల లాగానే కోడలు గురించి ఆలోచించారు అత్తమామలు.


 కోడలికి రెండో పెళ్లి చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి న్యూయుగ్ ప్రకాష్ కుమారుడు ప్రియాంక్ తివారి.. కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడి చనిపోయాడు. కాగా అతనికి భార్య ప్రియాంక 9 ఏళ్ల కూతురు కూడా ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే కోడలు జీవితం చీకటి కావద్దు అని అత్తమామలు గొప్ప మనసుతో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. సొంత కూతురిలా భావించి వరుడు కాళ్లు కడిగి మరి కోడలని కన్యాదానం చేశారు. ఇక తమ కొడుకు పేరు మీద ఉన్న ఇంటిని కోడలికి కట్నంగా ఇచ్చారు. ఇక్కడ అత్తమామలుచేసిన పని అందరికీ ఆదర్శంగా నిలిచింది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: