జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజులో ఎంతగా కసిపేరుకుపోయిందో అర్ధమైపోతోంది. కసి పెరిగిపోయిందంటే పెరిగిపోకుండా ఉంటుందా ? విచారణపేరుతో ఏపీసీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలతో రఘురాజు నెలలపాటు మంచందిగటానికి లేకుండా పోయింది. విచారణపేరుతో సీఐడీ పోలీసులు తనను లాఠీలతో చచ్చేట్లు కొట్టారంటు రఘురాజు ఎంత గోలచేశారో అందరికీ తెలిసిందే.





ఇదే విషయాన్ని శనివారం ఢిల్లీలో మీడియాతో గుర్తుచేసుకున్నారు. ఎందుకంటే శనివారం రఘురాజు 60వ పుట్టినరోజు. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజును ఎంతో ఘనంగా చేసుకునే వాడినని చెప్పారు. కానీ 59వ పుట్టినరోజు మాత్రం సీఐడీ విచారణలో నిద్రలేని రాత్రి గడిపినట్లు చెప్పారు. ఆరోజు తాను ఎంతగా ఇబ్బందిపడ్డానో తనకు మాత్రమే తెలుసన్నారు. తన పుట్టినరోజున తనకు అలాంటి గిఫ్ట్ ఇచ్చిన జగన్ కు తాను కూడా తొందరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని శపథం చేశారు.





సరే జగన్ కు తిరుగుబాటు ఎంపీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా లేదా ఆయనకు అసలంత సీనుందా అనేది కూడా డౌటే. ఎందుకంటే ఇప్పటికిప్పుడు తిరుగుబాటు ఎంపీ జగన్ కు వ్యతిరేకంగా ఏమీ చేయగలిగేదిలేదు. జగన్ కు వ్యతిరేకంగా రఘురాజు ఇటు కోర్టుల్లోను అటు కేంద్రానికి ఫిర్యాదుల రూపంలోను ఫిర్యాదులు, కేసులు వేస్తు చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. అయితే ఎందులోను సక్సెస్ కావటంలేదు.





ఫెయిల్యూర్లు పెరిగిపోయేకొద్దీ జగన్ పై తిరుగుబాటు ఎంపీలో కసి అంతకంతకు పెరిగిపోతోంది. జగన్ సీఎంగా ఉన్నంతకాలం ఆయన చేయగలిగేది ఏమీలేదు. 2024కి ఎంపీ పదవీకాలం కూడా అయిపోతుంది. అసలు తాను ఎప్పుడో రాజీనామా చేస్తానని, ఉపఎన్నికల్లో మళ్ళీ పోటీచేస్తానని కూడా ఒకపుడు ఛాలెంజ్ చేశారు. అయితే ఉపఎన్నికల్లో మళ్ళీ గెలుపుపై అనుమానాలు పెరిగిపోయినట్లున్నాయి. అందుకనే రాజీనామ అంశంపై మాట్లాడటంలేదు. ఒకవేళ ఓడిపోతే మళ్ళీ మళ్ళీ గిఫ్టులు తీసుకోవాల్సొస్తుందన్న భయమే రాజీనామా చేయకుండా ఆపినట్లుంది. ఇంతోటి ధైర్యశాలి జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని బెదిరించటమేంటో ?

మరింత సమాచారం తెలుసుకోండి: