ప్రపంచంలోని చాలా దేశాలు నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్  అంటే వణికిపోతాయి. పక్కనే ఉన్న దక్షిణకొరియా, ఎక్కడో ఉన్న అగ్రరాజ్యం అమెరికా కూడా కిమ్ అంటే ఉలిక్కిపడతాయి. అలాంటి నియంత కిమ్ కూడా ఇపుడు వణికిపోతున్నారు. దీనికి కారణం ఏమిటంటే కరోనా వైరస్సే. దేశంలో ఒక్కసారిగా పెరిగిపోతున్న కరోనా వైరస్ ను ఎలా కంట్రోల్ చేయాలో అర్ధంకాక కిమ్ లో టెన్షన్ పెరిగిపోతోంది.





దేశంలోని మనుషులో లేదా పొరుగునే ఉన్న దాయాదిదేశం దక్షిణకొరియానో కాదు గట్టిగా మాట్లాడితే భయపడిపోవటానికి. యావత్ ప్రపంచాన్ని గడగడ వణికించిన, చైనాను ఇప్పటికీ వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ఇపుడు కిమ్ కిందా మీదా అవుతున్నారు. ఇంతకాలం ప్రపంచం మొత్తంలో కరోనా వైరస్ జాడలేని దేశంగా నార్త్ కొరియా ప్రచారంలో ఉంది. దేశంలోపల ఏమి జరుగుతోందో బయటప్రపంచానికి ఏమీతెలీదు కాబట్టి కిమ్ చెప్పిందే ప్రపంచం నమ్మాలి.





కానీ ఇపుడు కిమ్ చెప్పకుండానే ప్రపంచానికి తెలిసిపోతోంది లోపల ఏమి జరుగుతోందో. లోపల ఏమి జరుగుతోందంటే దేశవ్యాప్తంగా కోవిడ్ అనుమానిత కేసులు 8.5 లక్షలు నమోదయ్యాయి. వీరిలో 3.5 లక్షల మంది ఆసుపత్రుల్లో చేరి వైద్యం చేయించుకుంటున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సుమారు వందమంది చనిపోయారు. కరోనా వైరస్ బాధితులు, చనిపోయేవారి సంఖ్య పెరిగిపోతుండటంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ పెట్టేస్తున్నారు.





షాపింగ్ మాల్స్, పరిశ్రమలు, సినిమాథియేటర్లు, వ్యాపారసంస్ధలు, విద్యాసంస్ధలన్నింటినీ ప్రభుత్వం మూసేసింది. పబ్లిక్ మూమెంట్ మీద ప్రభుత్వం తీవ్రమైన ఆంక్షలను విధించింది. అయినా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఒక్కసారిగా దేశంలో కేసులు ఎందుకు పెరిగిపోతున్నాయి ? ఎందుకంటే పొరుగునే ఉన్న చైనాలో నుండి జనాలు వస్తుండటంతో నార్త్ కొరియాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అలాగే కరోనా వ్యాక్సిన్ను జనాలకు వేయించేందుకు కిమ్ ఇష్టపడలేదు. ప్రపంచదేశాలన్నీ వ్యాక్సిన్ వేయించుకుంటుంటు కిమ్ మాత్రం వ్యాక్సిన్ను దేశంలోకి అనుమతించలేదు. ఇది కూడా కరోనా కేసుల పెరుగుదలకు కారణమైంది. మొత్తానికి కరోనా వైరస్ ను చూసి కిమ్ కూడా ఇపుడు వణికిపోతున్నాడు.




మరింత సమాచారం తెలుసుకోండి: